Vasishta, Ram Charan: చరణ్ తో సినిమా గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు?

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు డైరెక్టర్ వశిష్ట. మొదటి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వశిష్ట తన తదుపరి సినిమా అవకాశాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేయడంతో ఈయన పేరు భారీగా మారుమోగిపోయింది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వశిష్ఠ తన గురించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పుకార్ల గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం కళ్యాణ్ రామ్ అంటూ సమాధానం చెప్పారు. అంతేకాకుండా తన గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయని తెలిపారు. నేను చిరంజీవితో సినిమా చేయడంతో కళ్యాణ్ రామ్ గారికి నాకు విభేదాలు వచ్చాయని చాలామందికి మాట్లాడారు అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.

చిరంజీవి గారితో అవకాశం రావడంతో బింబిసారా 2 కూడా వదులుకున్నానని అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. అదేవిధంగా రామ్ చరణ్ గురించి నేను ఎక్కడ మాట్లాడకపోయినా తన గురించి తన సినిమాల గురించి మాట్లాడినట్టు వార్తలను సృష్టించారు.

నేను రామ్ చరణ్ తో (Ram Charan) బాహుబలి లాంటి సినిమా చేస్తానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అసలు నేను ఎక్కడా కూడా రామ్ చరణ్ తో సినిమా చేస్తానని మాట్లాడలేదు అంటూ ఈ సందర్భంగా తన గురించి వచ్చిన వార్తల గురించి ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఈయన విశ్వంభర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus