జబర్దస్త్ షోతో పాటు పలు సినిమాలలో నటించడం ద్వారా పాపులర్ అయిన వేణు బలగం సినిమాతో దర్శకునిగా మారారనే సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ తో విడుదలైన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కడంతో పాటు ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయని సమాచారం అందుతోంది. మార్చి నెలలో ఈ సినిమా ఫస్ట్ హిట్ గా నిలిచింది.
మంచి కామెడీ టైమింగ్ ఉన్న వేణు తన శైలికి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. సతీష్ అనే జర్నలిస్ట్ ఈ కథ తను రాసిన కథ అని చెప్పడంతో పాటు మూల కథకు సంబంధించి తనకు క్రెడిట్స్ ఇవ్వాలని కోరారు. ఈ వివాదం పెద్దది కావడంతో దర్శకుడు వేణు స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఒక ఫ్యామిలీలో జరిగిన కథ బలగం మూవీ కథ అని మాది ఉమ్మడి కుటుంబం అని మా నాన్న చనిపోయిన సమయంలో ఈ పాయింట్ నా మైండ్ లో మెదిలిందని ఆయన తెలిపారు. మా కుటుంబంలో 100 మంది ఉంటామని కాకి ముట్టుడు తెలుగు సాంప్రదాయం అని వేణు చెప్పుకొచ్చారు. ప్రదీప్ అద్వైతం అనే ఫ్రెండ్ సపోర్ట్ తో ఈ కథను మలిచానని ఆయన కామెంట్లు చేశారు. అనుదీప్ కు ఈ కథ చెప్పానని వేణు వెల్లడించారు.
ఆరేళ్లు ఈ కథపై పరిశోధనలు చేశానని వేణు అన్నారు. గడ్డం సతీష్ కథను నేను చదవలేదని సినిమాను సతీష్ అభాసుపాలు చేయడం కరెక్ట్ కాదని కథ తనదే అనుకుంటే రచయితల సంఘాన్ని ఆయన ఎందుకు సంప్రదించలేదని వేణు చెప్పుకొచ్చారు. దిల్ రాజు బొమ్మను వాడుకుని సతీశ్ చిల్లర ప్రయత్నం చేస్తున్నారని వేణు పేర్కొన్నారు. వేణు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.