Viganesh,Nayanthara: నా కోడలు బంగారం.. నయనతార పై విగ్నేష్ తల్లి ప్రశంసలు!

తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న నయన్,విగ్నేష్ లు ఇటీవలే మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కోలీవుడ్ క్యూట్ కపుల్ తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార గొప్పతనానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే విషయాన్ని నయనతార అత్త అనగా విగ్నేష్ తల్లి మీనా కుమారి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీనా కుమారి మాట్లాడుతూ.. నా కొడుకు సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌. నా కోడలు స్టార్‌ హీరోయిన్‌. నా కొడుకు, కోడలు ఇద్దరూ కష్టపడి పనిచేయడమే కాదు. కష్టపడి పనిచేసేవాళ్లను కూడా అంతే గౌరవిస్తారు. అలా నయనతార ఇంట్లో మొత్తం ఎనిమిది మంది పనివాళ్లు ఉన్నారు.

అందులో ఒకరికి నాలుగు లక్షల అప్పు ఉందని తెలిసి వెంటనే ఆమె వాళ్లకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి సాయం చేసింది. అంత గొప్ప మనసు నా కోడలిది. తన దగ్గర పనిచేసేవాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే ఇంట్లో పనిచేసేవాళ్లకు అంతపెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సాయం చేసేందుకు ఎంతో దయా హృదయం ఉండాలి. పది మంది చేసే పనిని కూడా తను ఒక్కటే చేయగలదు నయనతార పై పొగడ్తల వర్షం కురిపించింది నయన్ అత్తమ్మ మీనా కుమారి.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా నయనతార దంపతులు ఇటీవలే సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. కాగా నయనతార పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలలో అదే ఊపుతో నటిస్తోంది. నయనతార చేతినిండా బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా స్టార్ హీరోయిన్లలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో నయనతార టాప్ లో ఉంది అని చెప్పవచ్చు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus