మలయాళీ దర్శకుడైన విక్రమ్ కె కుమార్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ‘ఇష్క్’, ‘మనం’, ’24’ లాంటి సరికొత్త కథలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. చివరిగా ఆయన తెలుగులో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘థాంక్యూ’ సినిమాను రూపొందిస్తున్నారు. మరో ఎనిమిది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని.. లాక్ డౌన్ తరువాత షూటింగ్ మొదలుపెట్టి ఆగస్టు తొలివారంలోపు మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు విక్రమ్ కె కుమార్.
అయితే చాలా కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయిందని అన్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీనిపై స్పందించిన విక్రమ్ కుమార్.. బన్నీతో సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కథ అందరికీ నచ్చితే కచ్చితంగా తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అన్నారు.
ఇక త్వరలోనే సరికొత్త జోనర్ లో సినిమా తీయబోతున్నట్లు చెప్పారు విక్రమ్. యానిమేషన్ జోనర్ లో ఓ సినిమా చేస్తానని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ఉంటుందని.. దానికి మూడు నాలుగేళ్లు సమయం వెచ్చించాల్సి ఉంటుందని చెప్పారు. స్క్రిప్ట్ అయితే యాభై శాతం పూర్తయిందని.. మరో ఏడాది తరువాత దాని పూర్వ నిర్మాణ పనులు మొదలవుతాయని స్పష్టం చేశారు. అలానే సంగీతం ప్రధానంగా సాగే ఓ సినిమా చేసే అవకాశం ఉందని.. దాని గురించి ఏఆర్ రెహ్మాన్ తో కూడా చర్చించానని.. ఆయనకు బాగా నచ్చిందని తెలిపారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!