VV Vinayak: వి.వి.వినాయక్ హెల్త్ గురించి ఇన్ని గాసిప్స్ ఎందుకు వస్తున్నాయి?

వి.వి.వినాయక్.. (V. V. Vinayak) కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) తో ‘ఛత్రపతి’ ని హిందీలో రీమేక్ చేశారు. ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. వినాయక్ ఓకే అంటే.. సినిమాలు చేయడానికి నిర్మాతలు చాలా మంది రెడీగా ఉన్నారు. వినాయక్ ఫామ్లో లేకపోయినా.. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయాలని యంగ్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఎందుకో వినాయక్ .. ఎటువంటి స్టెప్ తీసుకోవడం లేదు. మరోపక్క వినాయక్ హెల్త్ గురించి ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

VV Vinayak

ఇక వివరాల్లోకి వెళితే.. వి.వి.వినాయక్ కొద్దిరోజుల క్రితం సర్జరీ చేయించుకున్నారు అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వినాయక్ సర్జరీ చేయించుకుని.. డిశ్చార్జ్ కోసం ఎదురుచూస్తున్నట్టు కొద్దిరోజుల క్రితం టాక్ నడిచింది. కానీ ఈ వార్తలను వినాయక్ టీం తోసిపుచ్చింది. అందులో నిజం లేదని… రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే హాస్పిటల్ కి వెళ్లారని చెప్పి అక్కడితో ఫుల్-స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు మళ్ళీ వినాయక్ ఆరోగ్యం పాలైనట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో మళ్ళీ ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు కూడా టాక్ నడుస్తుంది. దీంతో వెంటనే వినాయక్ టీం స్పందించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ‘వి.వి.వినాయక్ అనారోగ్యం పాలయ్యారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. దయచేసి వాటిని నమ్మొద్దని, ప్రస్తుతం వినాయక్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని’ వినాయక్ టీం చెప్పుకొచ్చింది. అయితే వినాయక్ టీం చెప్పిందే కరెక్ట్ అయినప్పటికీ.. అసలు వినాయక్ హెల్త్ గురించి ఈ గాసిప్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్ధం కాని విషయం.

రష్మిక కోసం 70 కోట్ల బడ్జెట్.. నిజమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus