ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) (డిఎస్పీ) ఒక విశిష్ట స్థానం ఉంది. ఆయన సంగీతంతో ఎన్నో హిట్స్ అందించి, ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. వీరిద్దరి కాంబినేషన్ నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ మ్యూజికల్ గా నిలిచింది. అయితే ఒకప్పుడు దేవితో సినిమాలు చేసిన దర్శకులు ఇప్పుడు మెల్లగా యూ టర్న్ తీసుకుంటున్నారు.
తాజా సింహాసనాన్ని దేవిశ్రీప్రసాద్ స్లోగా కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. మొదటగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న RC16 సినిమాలో ఏఆర్ రెహమాన్ ని (A.R.Rahman) తీసుకోవడం, పెద్ద చర్చకు దారి తీసింది. అంతేకాకుండా, ‘ఉప్పెన’ (Uppena) వరకు దేవిశ్రీతో ఉన్న దర్శకులు, ఇప్పుడు ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారంటే, దేవిశ్రీ ప్రసాద్ ఎందుకు ఫెయిడ్ అవుతున్నారు అనే ప్రశ్న లేవనెత్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘దసరా’ (Dasara) సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కూడా దేవిశ్రీ ప్రసాద్ ని కాకుండా, సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) ని ఎంపిక చేసుకోవడం మ్యూజిక్ ఫ్యాన్స్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ప్రస్తుతం నాని (Nani) సినిమాతో అనిరుధ్ రవిచందర్‌ను (Anirudh Ravichander) తీసుకోవడంతో, మరోసారి దేవి కి అవకాశాలు తగ్గుతున్నాయా అనే అనుమానాలను పెంచుతోంది. కేవలం సుకుమార్ శిష్యులతోనే కాదు, కొరటాల శివ కూడా ‘ఆచార్య’ (Acharya) సినిమాతో దేవిశ్రీని విడిచి మణిశర్మ (Mani Sharma) వైపు వెళ్ళడం, పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. త్రివిక్రమ్ (Trivikram) కూడా ఒకప్పుడు దేవితో కంటిన్యూగా సినిమాలు చేశారు. కానీ ఆ తరువాత థమన్ త్రివిక్రమ్ కు (S.S.Thaman) క్లోజ్ అయ్యాడు.
దేవిశ్రీ ప్రసాద్ ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు ప్రాధాన్యత పొందడం అతనికి ఒక హెచ్చరికగా మారింది. ఇదే సమయంలో, అభిమానులు పుష్ప 2 (Pushpa 2) సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ తిరిగి తన స్థానం సంపాదిస్తాడని ఆశలు పెట్టుకున్నారు. దేవి కి ఇది ఒక బిగ్గెస్ట్ రీ ఎంట్రీగా మారి, మళ్ళీ తన కెరీర్ ను ఒక ట్రాక్ లోకి తెచ్చే అవకాశం ఇవ్వగలదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.