‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఇప్పుడు ‘డిస్కో రాజా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడూ రొటీన్ మాస్ సినిమాలు చేస్తున్నాడు అని ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ వంటి చిత్రాలని చేస్తే వాటికి మొహం చాటేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీను వైట్ల తో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అంటూ ఏదో ప్రయోగం చేస్తాడనుకుంటే.. ‘అతనొక్కడే’ ‘అపరిచితుడు’ వంటి చిత్రాలను మిక్సీలో వేసి జ్యుస్ తీసి ఇచ్చాడు. దీంతో ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు. ఈ కారణంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘డిస్కో రాజా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వి ఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 24న విడుదలై మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించినా .. మొదటి సోమవారం రోజున మాత్రం కలెక్షన్లు ఘోరంగా పడిపోయాయి.
ఇక ‘డిస్కో రాజా’ చిత్రం 4 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 2.64 cr |
సీడెడ్ | 0.87 cr |
ఉత్తరాంధ్ర | 0.83 cr |
ఈస్ట్ | 0.46 cr |
వెస్ట్ | 0.36 cr |
కృష్ణా | 0.43 cr |
గుంటూరు | 0.42 cr |
నెల్లూరు | 0.24 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.50 cr |
ఓవర్సీస్ | 0.64 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 7.39 cr (share) |
‘డిస్కో రాజా’ చిత్రానికి 22 కోట్ల బిజినెస్ జరిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.39 కోట్ల షేర్ ను రాబట్టింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ లు ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు పోటీగా ఉండడం.. అందులోనూ ‘డిస్కో రాజా’ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో.. ప్రేక్షకులు అంత ఆసక్తిని చూపించలేదని స్పష్టమవుతుంది. ఇక ఈ ‘డిస్కో రాజా’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 13.80 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి మొదటి వారం పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Click Here To Disco Raja Movie Review
డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!