రవితేజ నుండీ దాదాపు సంవత్సరం పై నుండీ ఒక్క చిత్రం కూడా రాలేదు. 2018 లో రవితేజ నుండీ వచ్చిన ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాలు పెద్ద డిజాస్టర్ లు అయ్యాయి. పైగా రొటీన్ సినిమాలు చేస్తున్నాడు రవితేజ అనే ముద్ర కూడా పడింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని ‘డిస్కో రాజా’ చిత్రం చేసాడు రవితేజ.
వి ఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 24 న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఎటువంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసారు. ఫస్ట్ హాఫ్ ఈ చిత్రం చాలా ఫాస్ట్ గా ఎంటర్టైనింగ్ గా సాగుతుందట. సెకండ్ హాఫ్ లో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుస్తుంది. హీరోయిన్ లలో నభా నటేష్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉందట. మరో హీరోయిన్ పాయల్ పాత్ర అంతంత మాత్రంగానే ఉంటుందట. తాన్య హాప్ కూడా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. సునీల్, వెన్నెల కిశోర్ పాత్రలు నవ్వులు పూయిస్తాయట. నిర్మాత రామ్ తల్లూరి ఖర్చుకి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడట. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం బాగుందట. ఈసారి మాత్రం మాస్ మహారాజ్ హిట్ కొట్టడం ఖాయం అని తెలుస్తుంది.