‘రాజా ది గ్రేట్’ తర్వాత మళ్ళీ హిట్ అందుకోలేదు మాస్ మహారాజ్ రవితేజ. తరువాత ఆయన చేసిన ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాలు డిజాస్టర్ లు అయ్యాయి. ఈ చిత్రాలు కనీసం 10 కోట్ల షేర్లను కూడా రాబట్టలేకపోయాయి. దీంతో రవితేజ తరువాతి సినిమా అయిన ‘డిస్కో రాజా’ కి 10 కోట్ల బిజినెస్ అయినా జరుగుతుందా అనె అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ రవితేజ మార్కెట్ ఏమాత్రం దెబ్బ పడలేదు ఆనే చెప్పాలి. వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో రామ్ తళ్ళూరి నిర్మించిన ‘డిస్కో రాజా’ చిత్రం జనవరి 24 న విడుదల కాబోతుంది.
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
6 cr
సీడెడ్
2.75 cr
ఉత్తరాంధ్ర
1.95 cr
ఈస్ట్
1.25 cr
వెస్ట్
1.05 cr
కృష్ణా
1.25 cr
గుంటూరు
1.50 cr
నెల్లూరు
0.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
4.10cr
ఓవర్సీస్
1.50 cr
వరల్డ్ వైడ్ టోటల్
22 cr
‘డిస్కో రాజా’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 22 కోట్ల బిజినెస్ జరిగింది. అంత మొత్తం రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే.