హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది అనేది ఇండస్ట్రీ మాట. అది కూడా ముందుగా.. ఒకటి, రెండు హిట్లు పడితేనే..! లేదు అంటే అది కూడా ఉండదు’ అని ఇక్కడ చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ తప్పని ప్రూవ్ చేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. రెండు హిట్లు వచ్చాక కూడా గ్లామర్ పైనే ఆధారపడితే… వాళ్ళు చెప్పినట్టు 5 ఏళ్ళ వరకు ఉంటారు. కాస్త కథలో కీలకమైన పాత్రని.. ముఖ్యంగా నటనకు ఆస్కారం కలిగిన పాత్రను ఎంపిక చేసుకుంటే.. వాళ్ళకి లైఫ్ ఉంటుంది.
Disha Patani
నయనతార (Nayanthara) , సమంత, అనుష్క వంటి వాళ్ళు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. కాజల్, తమన్నా వంటి హీరోయిన్లు గ్లామర్ పైనే ఆధారపడి… సమంత,అనుష్క, నయన్..లా ఎక్కువ కాలం స్టార్ స్టేటస్ ను అనుభవించలేకపోతున్నారు. తొందరలోనే ఈ లిస్ట్ లో దిశా పటాని (Disha Patani) కూడా చేరిపోయే ఛాన్స్ కనిపిస్తుంది.ఇటీవల ఆమె నుండి ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) ‘కంగువా'(Kanguva) వంటి సినిమాలు వచ్చాయి.
‘కల్కి..’ లో ఆమె పాత్ర ప్రభాస్ ను కాంప్లెక్స్ కి తీసుకెళ్లడం వరకు మాత్రమే ఉంటుంది. ఆ వెంటనే ఒక గ్లామర్ పాట తర్వాత మాయమైపోతుంది. అంతకు మించి ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ అంటూ ఏమీ ఉండదు. లేటెస్ట్ గా వచ్చిన ‘కంగువా’ లో కూడా అంతే..! సినిమా స్టార్టింగ్లో వస్తుంది. అక్కడక్కడ కనిపిస్తుంది. ఒక గ్లామర్ సాంగ్.. తర్వాత మాయం. ‘కంగువా’ లో కూడా దిశ (Disha Patani) పాత్రకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు.
అయినప్పటికీ ‘కల్కి..’ చిత్రానికి రూ.6 కోట్లు, ‘కంగువా’ చిత్రానికి రూ.8 కోట్లు పారితోషికం అందుకుందట ఈ బ్యూటీ. పారితోషికం సంగతి ఎలా ఉన్నా.. ఇలాగే గ్లామర్ పై ఆధారపడి సినిమాలు చేస్తే.. త్వరగానే ఫేడౌట్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఆమె పాత్రల ఎంపిక పై శ్రద్ధ పెట్టాలి.