Hero Nani: ఆ పని చేసినందుకు చాలా సిగ్గుపడ్డా: నాని

నాని గురించి, అతని స్కూల్‌ డేస్‌ గురించి మీరు ఇప్పటికే ఓ వార్త చదివి ఉంటారు. అయినా స్కూల్‌ డేస్‌, చిన్ననాటి రోజుల గురించి తెలుసుకోవాలంటే ఒకటి, రెండు రోజులు ఎక్కడ సరిపోతాయి చెప్పండి. అందుకే మరో బంచ్‌ ఆఫ్‌ ఫన్నీ మూమెంట్స్‌ నానివి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులో కొన్ని సీన్స్‌ అతని సినిమాలో కూడా కనిపిస్తాయి. ‘నేను లోకల్‌’ సినిమాలో చూపించిన కొన్ని సీన్స్‌ అతని నిజ జీవితం నుండి తీసుకొచ్చినవే అట.

నానికి పరీక్షలంటే చాలా భయమట. అందుకే పరీక్షలప్పుడు షూస్‌లో స్లిప్పులు పెట్టుకెళ్లారట. అలా చేసి రెండు మూడుసార్లు దొరికిపోయాడట కూడా. అయితే అదృష్టం కొద్దీ ఎవరూ డీబార్‌ చేయలేదు అంటుంటాడు నాని. ‘నేను లోకల్‌’ సినిమాలోని చూపిచిన అలాంటి సీన్లు నా జీవితంలో జరిగినవే అని చెప్పాడు నాని. ఇక చదువుకునే రోజుల్లో ‘దళపతి’ సినిమా అంటే చాలా ఇష్టపడేవాడట నాని. రజనీకాంత్‌, మమ్ముట్టీ యాక్షన్‌ సూపర్‌ అంటుంటాడు. అందుకే వీలు కుదిరినప్పుడల్లా ఆ సినిమానే చూస్తుంటాడట.

స్నేహితుడితో ఓసారి నాని ‘దెయ్యం’ సినిమాకు వెళ్లాడట. కాసేపు చూసేసరికే ఓ రేంజ్‌లో భయమేసిందట. దీంతో ఒళ్లంతా చెమటలు పట్టేశాయట. భయంతో వచ్చిన వణుకుతో చేతిలో ఉన్న కూల్‌డ్రింక్‌ ఒలికిపోయి ప్యాంట్‌ తడిసిపోయిందట. ప్యాంట్‌ చూసిన నాని ఫ్రెండేమో భయంతో తడిపేసుకున్నాడని పొరబడ్డాడడట. అలాగే చదువుకునే రోజుల్లో ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓసారి ఫ్రెండ్‌ చేసిన తప్పునకు నాని లాఠీ దెబ్బలు తిన్నాడట. ఆ విషయాన్ని మరచిపోలేను అని చెబుతాడు నాని.

కాలేజ్‌ డేస్‌ కాసేపు పక్కన పెట్టి… రీసెంట్‌ మూవీ గురించి చూస్తే… ‘అంటే… సుందరానికీ’ షూటింగ్‌ కోసం న్యూయార్క్‌లో సున్నా డిగ్రీల చలిలో యాక్ట్‌ చేశారట. ఆ సమయంలో కోట్‌ కూడా లేకుండా మామూలు షర్టు వేసుకున్నాడట. దీంతో బాడీ ఫ్రీజ్‌ అయిపోతుందేమో అనిపించేంత చలి వేస్తోందట. అయితే ఆ విషయం బయటకు తెలియకుండా సహజంగా నటించాల్సి వచ్చింది. దాని కోసం చాలా కష్టపడ్డా అని చెబుతాడు నాని. చూద్దాం పదో తేదీ సినిమా వస్తుందిగా.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus