ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల కలెక్షన్లకు సంబంధించి ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. పెద్ద సినిమాలు తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో కలెక్షన్లు ఫేక్ అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమాల కలెక్షన్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అస్సలు సంతోషంగా లేరు. తమిళ డిస్ట్రిబ్యూటర్ ఒకరు తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. కోలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధినేత అయిన తిరుపూర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ సినిమా ప్రొడ్యూసర్లు బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించి నిజాలు చెప్పాలని ఆయన అన్నారు.
ఈ మధ్య కాలంలో చెప్పిన బాక్సాఫీస్ కలెక్షన్లు అన్నీ అబద్ధాలే అని (Distributor) ఆయన కామెంట్లు చేశారు. అబద్ధాలు చెబుతున్నందుకు నిర్మాతలు సిగ్గు పడాలని సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే నిజం చెప్పి నిర్మాతకు బుద్ధి వచ్చేలా చేయాలని ఆయన వెల్లడించారు. సినిమాల అసలు కలెక్షన్లను మేము బయటపెడితే నటీనటులు, నిర్మాత సీరియస్ అవుతారని ఆయన కామెంట్లు చేశారు. అభిమానుల కొరకు, హీరోల కొరకు తప్పుడు లెక్కలు చెప్పొద్దని ఆయన కోరారు.
నిర్మాతలు నిజాలు చెబితే ఇండస్ట్రీ బాగుపడుతుందని ఫ్లాప్ సినిమాలకు సక్సెస్ మీట్ పెట్టి డబ్బులను వేస్ట్ చేయొద్దని ఆయన కోరారు. మంచి సినిమాల కోసం డబ్బును ఖర్చు చేయాలని ఆయన సూచించారు. మంచి సినిమాలతో ప్రేక్షకులను సంతృప్తిపరచాలే తప్ప హీరోలను కాదని ఆయన తెలిపారు. నిర్మాతలు గొప్పలు చెప్పుకున్న సినిమాలకు మాకు మాత్రం నష్టాలే మిగిలాయని ఆయన కామెంట్లు చేశారు.
తిరువూర్ సుబ్రహ్మణ్యం కామెంట్ల గురించి తమిళ నిర్మాతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. ఆయన ఆవేదనలో న్యాయం ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ ను నమ్ముకున్న వాళ్లలో చాలామందికి షాకింగ్ ఫలితాలు వస్తున్నాయి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!