మన భారతదేశ ప్రజలను పాలించేందుకు అసెంబ్లీలో, పార్లమెంట్లో మన రాజకీయ నాయకులు ఎంతగా పోటీపడుతూ మీటింగ్స్ లో గొడవ పడటారో తెలియదు కానీ.. తిప్పి కొడితే 1000 మెంబర్స్ కూడా లేని మా అసోసియేషన్ ను మాత్రం తెగ గోల చేస్తోంది. శివాజీ రాజాను బలవంతంగా తప్పించి.. ఎన్నికల్లో ఘనమైన మెజారిటీతో గెలిచిన నరేష్ ప్యానల్ విధులు నిర్వహించడం మొదలెట్టి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే.. బోలెడన్ని గొడవలు. ఈ గొడవలు ఆపోజిట్ టీం మెంబర్స్ తో కూడా కాదు.. వాళ్ళలో వాళ్ళే తిట్టుకుచస్తున్నారు.
ఇటీవల నరేష్ చేసే పనులు, తీసుకోనే డెసిషన్స్ మా అసోసియేషన్ మెంబర్స్ కు కానీ సినిమా కార్మికులకు కానీ లాభదాయకంగా లేదని.. జీవిత-రాజశేఖర్ లు ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారట. ఆ మీటింగ్ లో నరేష్ ప్యానల్ & ఆపోజిట్ ప్యానల్ కూడా కూర్చున్నారు. అయితే.. ఆపోజిట్ టీం మెంబర్స్ కంప్లైంట్స్ రైజ్ చేసే లోపు వీళ్లలో వీళ్ళే ఇష్టమొచ్చినట్లు మాటలు అనేసుకోవడం మొదలెట్టారట. ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేని పరుచూరి గోపాలకృష్ణ వాకౌట్ చేశారు. అలాగే.. చాలామంది సీనియర్స్ బయటకు వెళ్ళిపోయారు. అయితే.. ఈ గొడవలన్నిటికీ జీవిత-రాజశేఖర్ దంపతులు కారణమని పేర్కొంటున్నారు మా మెంబర్స్. మరి ఈ గొడవలు తగ్గితే కాస్త అసోసియేషన్ కు పేరొస్తుంది. లేదంటే.. ఇంకా చీప్ గా చూస్తారు జనాలు.