సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఆపేయాలంటూ టిడిపి ప్రతినిధి దివ్యవాణిఎన్నికల కమిషన్ కు లేఖ రాసారు. ఈ చిత్రంలో నిజం లేక పోగా వివాదాలకు దారితీసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఆమె చెబుతుంది. టిడిపి ని స్థాపించిన వ్యవస్థాపకుడు పై వైసిపి నేత నిర్మించడం వెనుక పెద్ద కుట్రే ఉందని ఆమె ఆరోపిస్తుంది. అంతే కాదు ఎన్నికల కోడ్ కూడా అమలులో వుండగా బయోపిక్ లు ఎలా విడుదల చేస్తారని ఆమె కొత్తగా ప్రశ్నింస్తుంది.
ఈ చిత్రం ఎన్నికల్లో టిడిపి పై ప్రభావం చూపే అవకాశం ఉందంటుంది. ‘చంద్రబాబు పై తనకున్న స్వామిభక్తిని బాగా ప్రదర్శింస్తుందని కొందరు వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయినా ఎన్నికల కమిషన్ నుండీ హై కోర్టు వరకూ క్లియరెన్స్ అందుకుని మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఇంతలా అడ్డుకోవాలని ఎందుకు చూస్తున్నట్టు అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్లు పెడుతుంటే… రాంగోపాల్ వర్మ కంటే ఎక్కువగా ఈ చిత్రాన్ని దివ్య వాణి ప్రమోట్ చేస్తుందని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మర్చి 29 న(మరో రెండు రోజుల్లో) విడుదల కాబోతుంది.