ఈ దీపావళి పండుగ సందర్భంగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కలిపి ఏడు కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అయ్యాయి. వీటిలో ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతను సొంతం చేసుకుని, ప్రేక్షకులకు పండగ వాతావరణాన్ని అందించాయి. తెలుగులో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar), కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రధాన పాత్రలో ఉన్న ‘క’(KA) సినిమాలు రిలీజై పాజిటివ్ టాక్ అందుకున్నాయి. రివ్యూస్ కూడా బాగా రావడంతో, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.
OTT
తమిళంలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) జోడిగా వచ్చిన ‘అమరన్’ (Amaran) కూడా మంచి స్పందనను అందుకుంది. ఈ సినిమాకి యునానమస్ గా పాజిటివ్ టాక్ రావడంతో, తమిళ ప్రేక్షకులు దానిపై విశేషమైన ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే జయం రవి (Jayam Ravi) నటించిన ‘బ్రదర్’ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కన్నడలో శ్రీ మురళి నటించిన ‘బఘీర’ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక హిందీలో, రోహిత్ శెట్టి (Rohit Shetty) డైరెక్షన్ లో వచ్చిన ‘సింగం ఎగైన్’(Singham Again) పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంటే, కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరోగా విద్యాబాలన్ (Vidya Balan) , మాధురి దీక్షిత్ (Madhuri Dixit) ప్రధాన పాత్రల్లో నటించిన ‘భూల్ భులయ్యా 3’ (Bhool Bhulaiyaa 3) హార్రర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకుల్ని మెప్పించింది.
ఇప్పుడు ఈ సినిమాల ఓటీటీ (OTT) డీల్స్ విషయానికి వస్తే, వీటిలో కొన్ని సినిమాల డిజిటల్ రైట్స్ ముందుగానే సెట్ అయ్యాయి. ‘లక్కీ భాస్కర్,’ ‘అమరన్,’ ‘బఘీర,’ ‘భూల్ భులయ్యా 3’ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీకి ఈటీవీ విన్ ఓటీటీ (OTT) పార్ట్నర్ గా ఉంది. అలాగే జయం రవి నటించిన ‘బ్రదర్’ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
అంతేకాకుండా, ‘సింగం ఎగైన్’ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. వీటిలో తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, కానీ హిందీ సినిమాలు ఓటీటీ కి రావడానికి సుమారు 8 వారాల సమయం పడుతుంది. ఈ పండగ సీజన్ లో వీటన్నింటిలో శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమా యునానమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.