Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Singham Again Review in Telugu: సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Singham Again Review in Telugu: సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 1, 2024 / 01:41 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Singham Again Review in Telugu: సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అజయ్ దేవగన్ (Hero)
  • కరీనా కపూర్ (Heroine)
  • అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపిక పదుకొనె, టైగర్ ష్రాఫ్ తదితరులు.. (Cast)
  • రోహిత్ శెట్టి (Director)
  • రోహిత్ శెట్టి - అజయ్ దేవగన్ - జ్యోతి దేశ్ పాండే (Producer)
  • రవి బస్రూర్ - తమన్ (Music)
  • గిరీష్ కాంత్ - రాజా హుస్సేన్ మెహతా (Cinematography)
  • Release Date : నవంబర్ 01, 2024
  • రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ - జియో స్టూడియోస్ - రోహిత్ శెట్టి పిక్చర్స్ - దేవగన్ ఫిలిమ్స్ - సినర్జీ (Banner)

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 8 వందకోట్ల కలెక్షన్స్ దాటిన సినిమాలున్న ఏకైక బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty)  . “దిల్ వాలే” లాంటి డిజాస్టర్ సినిమాతో కూడా కోట్లు కొల్లగొట్టిన ఘనుడు. అయితే.. “సర్కస్” సినిమాతో అతడి పరిస్థితి మారిపోయింది. అ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ తన సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే తనతో సినిమాలు తీసిన అజయ్ దేవగన్  (Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), దీపిక పదుకొనె(Deepika Padukone) , కరీనా కపూర్ (Kareena Kapoor), రణవీర్ సింగ్ (Ranveer Singh) వంటి బడా స్టార్స్ అందరినీ కలుపుకొని తనకు బాగా అచ్చొచ్చిన పోలీస్ యాక్షన్ డ్రామాగా “సింగం ఎగైన్” (Singham Again) . ను రూపొందించాడు. మరి ఈ సినిమాతో దర్శకుడిగా రోహిత్ శెట్టి కమ్ బ్యాక్ ఇవ్వగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

Singham Again Review in Telugu

కథ: ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ తోనే కథ ఏమిటి అనేది క్లారిటీ ఇచ్చేసాడు రోహిత్ శెట్టి. బహుశా ఎవరు 5 నిమిషాల ట్రైలర్ ను విడుదల చేసి ఉండరు. సో, జుబైర్ (అర్జున్ కపూర్)  (Arjun Kapoor) తన పగ తీర్చుకోవడం కోసం అవ్ని (కరీనా కపూర్)ను కిడ్నాప్ చేయగా, ఆమెను కాపాడడం కోసం బాజీరావు సింగం (అజయ్ దేవగన్) & టీమ్ ఏం చేశారు? అనే కాన్సెప్ట్ ను రామాయణానికి జోడించి తెరకెక్కించిన చిత్రమే “సింగం ఎగైన్” (Singham Again ).

నటీనటుల పనితీరు: 2012లో హీరోగా కెరీర్ మొదలుపెట్టి దాదాపుగా 18 సినిమాలు చేసిన అర్జున్ కపూర్ మొట్టమొదటిసారిగా నటుడిగా ఈ చిత్రంలో అలరించాడు. అతడి విలనిజం, అతడి స్క్రీన్ ప్రెజన్స్ సదరు పాత్రకు మంచి వెల్యూ యాడ్ చేసింది. మరీ ముఖ్యంగా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ఫ్రాఫ్ (Tiger Shroff) వంటి భారీ తారాగణం ఉండగా తాను హైలైట్ అవుతానని అర్జున్ కపూర్ కనీసం కలలో కూడా ఊహించి ఉండదు. ఇకపై అతడికి విలన్ రోల్స్వెల్లువెత్తడం ఖాయం.

అజయ్ దేవగన్ ఎప్పట్లానే కాలు కదపకుండా ఫైట్లు చేసేసి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ తదితరులు తమదైన శైలి పోరాట సన్నివేశాలతో సినిమాకి మసాలా యాడ్ చేసారు. కరీనా కపూర్ ఒద్దికగా కనిపించగా.. దీపిక పదుకొనె మాత్రం లేడీ సింగంగా ఓవర్ యాక్షన్ తో చిరాకు పెట్టించింది. జాకీ ష్రాఫ్, దయానంద్ శెట్టి (Dayanand Shetty) , రవికిషన్ (Ravi Kishan)తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: గిరీష్ కాంత్ – రాజా హుస్సేన్ మెహతా (Raza Mehta) సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా దీపిక పదుకొనె ఎంట్రీ సీన్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఇక యాక్షన్ బ్లాక్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. రవి బస్రూర్ (Ravi Basrur) & తమన్ (S.S.Thaman) ద్వయం అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అదే విధంగా నేపథ్య సంగీతం కూడా చెప్పుకొనే స్థాయిలో లేదు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. అవసరమైనదానికంటే ఎక్కువగా భర్చు పెట్టారు.

దర్శకుడు రోహిత్ శెట్టి కథను రామాయణ పర్వాలుగా చెప్పాలనుకున్న ఆలోచన బాగున్నప్పటికీ.. కథనంలో బలం లేకపోవడంతో దర్శకుడిగా, రచయితగా విఫలమయ్యాడు. యాక్షన్ బ్లాక్స్ లో లాజిక్స్ & సెన్సిబిలిటీస్ ఉండకపోవడం అనేది పర్లేదు కానీ, కనీసం కథనంలో ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషన్ అనేది ఎక్కడా వర్కవుట్ అవ్వలేదు. చాలా సీన్స్ ఆల్రెడీ ఎక్కడో చూసేశామనే భావన కలుగుతుంది. ఇకనైనా రోహిత్ శెట్టి కాస్త కథ-కథనాల మీద దృష్టి సారిస్తే బాగుంది. లేదంటే.. ఆడియన్స్ అతడి సినిమాలను పట్టించుకోవడం మానేస్తారు.

విశ్లేషణ: కథలో ఎమోషన్ లేకుండా రామాయణం అనే ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారులే అనే ఉద్దేశ్యంతో రోహిత్ శెట్టి హిందూ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకొని తెరకెక్కించిన “సింగం ఎగైన్”  సినిమాగా ఆకట్టుకోవడంలో బోల్తా కొట్టింది. అన్నేసి మంది హీరోలు, హీరోయిన్లు ఉన్నా.. పోలోమారి స్కార్పియో బండ్లు గాల్లో ఎగిరినా, అజయ్ దేవగన్ కి ఓ 20 ఎంట్రీ సీన్లు ఉన్నా కూడా ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అసలు స్లోమోషన్ షాట్స్ అన్నీ కాస్త స్పీడప్ చేస్తే గంటన్నర సినిమా ఇది. ఇంత పేలవమైన కథ-కథనాలతో రోహిత్ శెట్టి ఎలా హిట్టు కొడదామనుకున్నాడో ఆయనకే తెలియాలి. ఆడియన్స్ చాలా అప్డేట్ అయ్యారు రోహిత్ శెట్టి.. మీరు కూడా అప్డేట్ అవ్వాల్సిన సమయం వచ్చింది.

ఫోకస్ పాయింట్: కష్టం సింగం!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Akshay Kumar
  • #kareena kapoor
  • #Ranveer Singh
  • #Rohit Shetty

Reviews

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 seconds ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

22 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version