సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డిజె టిల్లు’. ‘ఫార్చూన్ ఫోర్ సినిమాస్’ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా… డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్లను రాబట్టింది.
దాంతో మొదటి 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన…ఈ చిత్రం ఇప్పటికే బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సాధించింది.భీమ్లా తో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా ఈ చిత్రం కలెక్షన్లు పర్వాలేదనిపించడం విశేషం.
ఒకసారి 12 వీక్స్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 6.83 cr |
సీడెడ్ | 1.67 cr |
ఉత్తరాంధ్ర | 1.28 cr |
ఈస్ట్ | 0.75 cr |
వెస్ట్ | 0.78 cr |
గుంటూరు | 0.73 cr |
కృష్ణా | 0.63 cr |
నెల్లూరు | 0.44 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 13.11 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.98 cr |
ఓవర్సీస్ | 2.02 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 16.11 cr |
‘డిజె టిల్లు’ చిత్రానికి రూ.8.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.3 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 2 వారాలు పూర్తయ్యేసరికి రూ.16.11 కోట్ల షేర్ ను రాబట్టింది.బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఈ చిత్రం రూ.6.91 కోట్ల(కరెక్టెడ్) వరకు లాభాలను అందించింది. భీమ్లా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘డిజె టిల్లు’కి 3 వ వీకెండ్ కు 100 థియేటర్లు దక్కాయని తెలుస్తుంది. సో ఈ వీకెండ్ కు కూడా టిల్లు సందడి ఉండనే ఉంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!