DJ Tillu Review: డిజే టిల్లు సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 12, 2022 / 01:59 PM IST

“కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమ” వంటి సినిమాలతో లాక్ డౌన్ టైంలో కథానాయకుడిగా, కథకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించి కథకుడిగానూ పని చేసిన చిత్రం “డీజే టిల్లు”. ఈ సినిమా పాటలు, టీజర్ & ట్రైలర్ యూత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాను ప్రమోట్ చేసిన విధానం కూడా బాగుండడంతో.. నేడు (ఫిబ్రవరి 12) విడుదలైన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి టిల్లు బాబు ఆ అంచనాలను అందుకోగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: హైద్రాబాద్ లోకల్ గల్లీల్లో బాగా పాపులర్ అయిన లోకల్ డీజే టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ). తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ఒక గ్యాంగ్ ను మైంటైన్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఫుల్ జోష్ లో ఉన్న టిల్లు లైఫ్ లోకి ఎంటరవుతుంది రాధిక (నేహా శెట్టి). ఫస్ట్ లుక్ లోనే ఆమెను ఇష్టపడిన టిల్లు ఆమెతో ప్రేమాయణంలోకి పూర్తిగా దిగేలోపే.. రాధిక పుణ్యమా అని ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు టిల్లు. ఆ కేస్ నుండి ఎలా బయటపడ్డాడు? అసలు రాధికకు ఆ మర్డర్ కు సంబంధం ఏమిటి? అనేది “డీజీ టిల్లు” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు: టిల్లు అనే అల్లరి క్యారెక్టర్ ను సిద్ధూ ఓన్ చేసుకున్న విధానం బాగుంది. ఈ సినిమాకి రైటర్ కూడా కావడం వలన ఆ క్యారెక్టర్ తో ముందు నుంచీ జర్నీ చేయడం వలన టిల్లు క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. సిద్ధూ రొమాంటిక్ సెన్స్ కంటే కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమాలో ఆ కామెడీ సెన్స్ పూర్తిస్థాయిలో ఎలివేట్ అయ్యింది. టిల్లు క్యారెక్టరైజేషన్ & డైలాగ్స్ కు యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడమే కాక ఆ పాత్ర స్వభావాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.

నేహా శెట్టి గ్లామర్ డోస్ కాస్త పెంచింది. అయితే.. ఆ గ్లామర్ డోస్ ఎక్కడా వల్గారిటీ జోన్ దాటాకపోవడం విశేషం. అల్ట్రా గ్లామరస్ గా ఆమె క్యారెక్టరైజేషన్ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. బ్రహ్మాజీ, ప్రిన్స్, నర్రాల పాత్రలు సినిమాకి మంచి కామెడీ యాడ్ చేశాయి.

సాంకేతికవర్గం పనితీరు: తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంటే.. శ్రీచరణ్ పాకాల & రామ్ మిరియాల పాటలు సినిమాకి మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. సినిమాటోగ్రఫీ సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ రేంజ్ ను ఎలివేట్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ కథను ఆడియన్స్ కు అర్ధమయ్యేలా చేసింది. దర్శకుడు విమల్ & హీరో కమ్ రైటర్ సిద్ధూల నడుమ మంచి ర్యాపో ఉండడం సినిమాకి బాగా వర్కవుట్ అయ్యిందని చెప్పాలి. బేసిగ్గా చాలా సాధారణ కథ, ఒకానొక స్టేజ్ కి వచ్చేసరికి అసలు కథ ఏముంది అని కూడా అనిపిస్తుంది.

కానీ.. క్యారెక్టరైజేషన్స్ & కామెడీతో సినిమాను చివరివరకూ ఆసక్తికరంగా నడిపించారు ఇద్దరూ. అందువల్ల కథను పట్టించుకోవాల్సిన అవసరం ఆడియన్స్ కు రాలేదు.

విశ్లేషణ: టీజర్ & ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్ కు తగ్గట్లుగానే “డిజే టిల్లు” సినిమా నడుస్తుంది. సిద్ధూ నటన & డైలాగ్స్, నేహా శెట్టి గ్లామర్ & కామెడీ సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. వీకెండ్ కి లాజిక్స్ ను పట్టించుకోకుండా హ్యాపీగా యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేయదగిన చిత్రమిది. ఎలాగూ పోటీగా విడుదలైన మిగతా సినిమాలకు పాజిటివ్ టాక్ కానీ ఆడియన్స్ రిసెప్షన్ కానీ లేదు కాబట్టి.. వీకెండ్ విన్నర్ గా “డిజే”ను డిక్లేర్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్: 3/5 

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus