DJ Tillu Trailer: ‘డీజే టిల్లు’.. ఇదొక చీటింగ్ లవ్ స్టోరీ!

సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’. అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇటీవల ఫిబ్రవరి 11న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు.

ఇప్పటికే సినిమాకి సంబంధించి పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘డీజే టిల్లు’ సాంగ్ కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు హీరో. ఆమె హీరోని కవ్విస్తూనే.. మిగిలిన వాళ్లతో కూడా ఎఫైర్లు పెట్టుకున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. ఈ విషయం తెలుసుకున్న హీరో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది స్టోరీ.

ట్రైలర్ అయితే యూత్ కి కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాపై సిద్ధు జొన్నలగడ్డ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎప్పుడో పదేళ్లక్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ తన కెరీర్ లో సరైన హిట్టు సినిమా చేయలేకపోయాడు. ఆయన నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమాలకు మంచి బజ్ వచ్చినప్పటికీ.. టాప్ రేంజ్ కి ఎదగలేకపోయాడు. మరి ‘డీజే టిల్లు’ అతడికి ఎలాంటి ఇమేజ్ ను తీసుకొస్తుందో..!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus