‘ఉప్పెన’ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు అంటే… మైత్రీ మూవీ మేకర్స్ అని ఠక్కున చెప్పేస్తారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కూ భాగముందనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. తన శిష్యుడు దర్శకుడిగా మారిన చిత్రం కావడంతో సినిమా నిర్మాణం, ప్రచారంలో సుకుమార్ ఆసక్తిగా వస్తున్నాడు అని అనుకున్నారు కొందరు. అయితే సుక్కు రావడానికి ఇదే కారణం కాదు. ఇంకొక కారణం కూడా ఉంది. అదే ఆ సినిమాకు సుకుమార్ కూడా నిర్మాత కావడం.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించాయి. మరి సినిమా లాభాల్లో సుకుమార్‌కు వచ్చేదెంత? లాక్‌డౌన్ తర్వాత వచ్చిన సినిమాల్లో మంచి వసూళ్లు సాధించిన చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రమిది. సినిమాను సుమారు ₹20 కోట్లలో తెరకెక్కించారని గతంలోనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ₹50 కోట్లకుపైగా షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటికి శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకోవాలి.
అన్నట్లు ఈ సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ మంచి ధరే ఇచ్చిందట. అవన్నీ కలిపితే సినిమా ఇప్పటివరకు రూ. 100 కోట్ల వరకు నిర్మాతలకు వచ్చాయట. అంటే రూ.20 కోట్ల పెట్టుబడికి రూ.70 కోట్లు వచ్చాయన్నమాట. అంటే ₹50 కోట్లు లాభం. అందులో సుకుమార్‌కి ₹20 కోట్లు అందుతాయని టాలీవుడ్ వర్గాల భోగట్టా.
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!