Nagarjuna: నాగార్జున షర్ట్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తాజాగా అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. నాగేశ్వరరావు గారి శతజయంతి వేడుక కావడంతో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరైస్ అందజేశారు

అలాగే నాగార్జున (Nagarjuna) ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి నాగార్జున ధరించిన షర్టు గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. ఈ వేడుకకు నాగార్జున ధరించిన షర్ట్ ధర గురించి నేటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ కార్యక్రమంలో నాగర్జున ధరించిన ఈ షర్ట్ ధర దాదాపు 85 వేల రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి నాగార్జున వేసుకున్నటువంటి ఈ షర్ట్ బిగ్ బాస్ 5 వీకెండ్ లో వేసుకొని సందడి చేశారు.

దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు ఒకసారి వేసుకున్నటువంటి షర్ట్స్ మామూలుగా ఇతర కార్యక్రమాలకు వేసుకోవడానికి ఇష్టపడరు. ఇక నాగార్జున తన తండ్రి శతజయంతి వేడుకలలో భాగంగా ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో వేసుకున్నటువంటి డ్రెస్ వేసుకొని రావడంతో ఈ విషయంపై నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. నాగార్జున మరీ ఇంత పిసినారినా బిగ్ బాస్ కార్యక్రమానికి వేసుకున్న డ్రెస్ తన తండ్రి శత జయంతి వేడుకలకు వేసుకోవడం అవసరమా అంటూ ఈయన పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus