సౌందర్య.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరుగని ముద్ర వేసుకున్నారు.. మహానటి సావిత్రి తర్వాత అంతటి గొప్ప ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోని అగ్రనటులందరితోనూ నటించి ఆకట్టుకున్నారు.. అప్పటి స్టార్ హీరోలందరికీ సౌందర్యతో కలిసి నటించాలని కోరిక ఉండేదట.. అందం, అభినయంతో పాటు అచ్చ తెలుగుదనంతో తిరుగులేని కథానాయికగా ఎదిగారామె.. తెలుగు ప్రేక్షకులు తమ ఇంట్లో మనిషిలా ఆదరించారు.. సౌందర్యతో ఎంతోమంది దర్శక నిర్మాతలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ప్లాన్ చేశారు కానీ తనకు కథ నచ్చితే వీలు చేసుకుని నటించేవారు..
ఆమె 100వ చిత్రం ‘శ్వేతనాగు’ మంచి విజయం సాధించింది.. కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుండగానే తన చిన్న నాటి స్నేహితుడు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు సౌందర్య.. ఆ తర్వాత కొద్ది రోజులకే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు.. ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో విమాన ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు.. ఆమె ఇకలేరన్న వార్తతో చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకలోకం కూడా ఉలిక్కి పడింది.. మళ్లీ అలాంటి మంచి నటిని చూడలేమంటూ కంటతడి పెట్టారు మహిళా ప్రేక్షకులు..
ఇదిలా ఉంటే.. సినీ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో సౌందర్య వివాహం జరిగింది.. ఫోటోలు, వీడియోలు నెట్టింట కనిపిస్తుంటాయి.. సౌందర్యకు భర్త రఘు అంటే చాలా ఇష్టం.. అందుకే ఆమె సంపాదించిన ఆస్తులన్నీ అతని పేరిట రాశారని.. ఆమె చనిపోయిన తర్వాత ఆస్తుల విషయంలో రఘు, సౌందర్య తల్లిదండ్రులకు మధ్య గొడవలు కూడా జరిగాయని అంటుంటారు.. సౌందర్య మరణించిన కొద్ది కాలం తర్వాత రఘు మరో పెళ్లి చేసుకుని గోవాలో ఉంటున్నారు..
అయితే సౌందర్య చనిపోయే నాటికి ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని, రఘు తన బాధ్యతలు తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.. అయితే ఆ వార్తలను సౌందర్య సన్నిహితులు ఖండించారు.. ఒక ఇంటర్వ్యూలో సౌందర్య సన్నిహితులు మాట్లాడుతూ.. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.. ‘‘సౌందర్య పెళ్లయిన రెండేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని అనుకుంది.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు.. అలాంటి పుకార్లు నమ్మకండి’’ అంటూ క్లారిటీ ఇచ్చారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?