Brahmanandam: బ్రహ్మానందం చిన్న కోడలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రహ్మానందం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే కొన్ని వందల సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇలా సినిమాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఈయనకు ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే.

మొదటి కుమారుడు గౌతమ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఇక రెండో కుమారుడు సిద్ధార్థ్ గత కొద్దిరోజుల క్రితం ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈయన ఉద్యోగరీత్యా విదేశాలలో స్థిరపడిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈయన హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. సిద్ధార్థ్ ఐశ్వర్య అనే అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు వీరిద్దరిది పెద్దలు నిశ్చయించిన వివాహం.

ఇలా బ్రహ్మానందం (Brahmanandam) కుమారుడి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బ్రహ్మానందం గారికి కాబోయే కోడలు ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే ఈమె ప్రముఖ డాక్టర్ పద్మజా విజయ్ కుమార్తె అని తెలుస్తుంది. కరీంనగర్ లో పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఉంది. ఇక ఐశ్వర్య కూడా తన తల్లి బాటలోనే డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె కూడా ప్రముఖ గైనకాలజిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక ఐశ్వర్య ఒక్కతే కూతురు కావడంతో ఈమె పేరిట భారీగా ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది. ఇలా భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని బ్రహ్మానందం తన కోడలిగా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగబోతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus