డైరెక్టర్ బాబీ లవ్ లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా… సినిమాని మించిన లవ్ స్టోరీ!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ డైరెక్టర్ గా కేఎస్ రవి ఆలియాస్ బాబీ పేరు మారు మోగిపోతుంది. ఈయన రవితేజ హీరోగా నటించిన పవర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అనంతరం పలువురు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు.ఇక తాజాగా ఈయన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ బాబీ ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈయన ప్రేమ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.అయితే ఈయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే… బాబి ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈయన ప్రేమ వివాహంలో ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి.ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే ఈయన భార్య మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.

ఈయన భార్య పేరు అనూష తన మామగారు ప్రభుత్వ ఉద్యోగి. బాబి అనూష ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ప్రేమలో ఉండగా వారి ప్రేమకు సహాయం చేస్తూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక వీరి స్నేహితుల లవ్ ఫెయిల్ కాగా వీరిది మాత్రం సక్సెస్ అయింది. ప్రపంచ స్థాయి చెస్ లో ఎన్నో పథకాలు అందుకున్నటువంటి ద్రోణవల్లి హారిక గురించి మనకు తెలిసిందే. ఈమె చెస్ లో ఎన్నో పథకాలను అందుకోవడమే కాకుండా ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డును కూడా అందుకుంది.

అయితే హారికకు బాబీకి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే… హారిక స్వయానం బాబి భార్య అనూషకు సోదరి. దీంతో హారిక బాబీకి స్వయాన మరదలు అవుతారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలని హారిక సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతూ పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus