Comedian Satya: సత్య సినిమాల్లోకి రాకముందు పడ్డ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

ప్రస్తుతం ఇండస్ట్రీ లో టాప్ లీడింగ్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో కమెడియన్ సత్య పేరు లేకుండా ఉండదు. కంటెంట్ లేని సన్నివేశాలను కూడా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వు రప్పించే కెపాసిటీ ఉన్న అతి తక్కువమంది కమెడియన్స్ లో ఆయన కూడా ఒకడు. అలాంటి టైమింగ్ కేవలం బ్రహ్మానందం , సునీల్ మరియు ఏం ఎస్ నారాయణ కి మాత్రమే ఉండేది. వాళ్ళ తర్వాత అదే రేంజ్ కామెడీ టైమింగ్ ని పండించగల సత్తా ఉన్న కమెడియన్ గా సత్య కి మంచి క్రేజ్ దక్కింది.

ఏడాదికి పదికి పైగా సినిమాలు చేస్తున్న (Comedian Satya) సత్య ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే రీసెంట్ గానే ఆయన ‘రంగబలి’ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ప్రముఖ యాంకర్స్ ఇమిటేట్ చేస్తూ చేసిన ఒక వీడియో వేరే లెవెల్ లో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో స్క్రీన్ షాట్స్ తీసుకొని మీమ్స్ కూడా తెగ క్రియేట్ చేస్తున్నారు నెటిజెన్స్.

ఈ ఏడాది ఇప్పటికే సత్య నటించిన 7 సినిమాలు థియేటర్స్ లో విడుదల అయ్యాయి. ఇంత బిజీ ఆర్టిస్టుగా మారి కోట్ల రూపాయిలు సంపాదిస్తున్న సత్య కి ఈ స్థానం తేలికగా ఏమి రాలేదు. ఎలాంటి ఆధారం లేకుండా హైదరాబాద్ కి వచ్చినప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు.ఈ గ్యాప్ లో ఆయన చేతికి దొరికిన ప్రతీ చిన్న పని చేస్తూ వచ్చాడు, అలా అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తీరుతున్న ఇతనిని కమెడియన్ ధన్ రాజ్ గుర్తించాడు.

ధన్ రాజ్ అప్పటికే ఇండస్ట్రీ కమెడియన్ గా కొనసాగుతూ జబర్దస్త్ లో ఒక టీం లీడర్ గా స్కిట్స్ చేస్తున్నాడు. సత్య ని చూడగానే ఇతని ముఖం లో మంచి వెటకారం ఉంది, మన టీం లోకి బాగా పనికొస్తాడని భావించి ఆయనని తన టీం లోకి తీసుకున్నాడు. అలా జబర్దస్త్ లో ధనాధన్ ధనరాజ్ టీం లో చాలా కాలం వరకు కొనసాగిన సత్య కి సినిమాల్లో మెల్లగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు సత్య. కమెడియన్గా సత్యకు భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుందాం..

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus