నందమూరి తారక రత్న మరణించి రోజులు గడుస్తున్నా.. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు ఇంకా షాక్‌లోనే ఉన్నారు.. తారక్ పిల్లల బాధ్యతలు తాను తీసుకుంటానని బాలయ్య హామీ ఇచ్చారు.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని.. పాదయాత్రలో బావ లోకేష్‌కు అండగా నిలబడాలని.. మళ్లీ ఏపీలో తమ పార్టీ అధికారంలోకి రావాలని.. చంద్రబాబు ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేయాలని.. భారీ ప్రణాళిక వేసుకున్నారు తారక రత్న.. కానీ దేవుడి ప్రణాళిక వేరుగా ఉంది.. పార్టీ వర్గాల వారు, నందమూరి అభిమానులు ఆయన ఇక లేరు అనే మాట అబద్ధం అయితే బాగుండు అని కోరుకుంటున్నారు..
వారి బాధ రెట్టింపయ్యే విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 22న 40వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన తారక రత్న.. ఫిబ్రవరి 18న కన్నుమూయడం.. ఆయన మొదటి జయంతి రోజునే చిన్నకర్మ జరిపించారు కుటుంబ సభ్యులు.. ‘ఇవాళ మీ 40వ పుట్టినరోజు.. ఈసారి ఫ్యామిలీ (భార్య బిడ్డలు), బాల బాబాయ్, ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అంగరంగ వైభవంగా సంబరాలు జరిగేవి.. జన్మదినం నాడు జయంతి శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు అన్నా’’ అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు..
అయితే పార్టీ కార్యక్రమాల్లో, ఎన్నికల కోసం తారక రత్న పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారట.. అందుకు గానూ నాలుగు బ్లాక్ కలర్ కాన్వాయ్స్ కొనుగోలు చేశారని.. ఏపీలో ఎక్కడినుండి పోటీ చేయాలనే విషయంలో క్లారిటీగా ఉన్నట్టు.. చంద్రబాబుతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.. అధిష్టానం ఆదేశిస్తే తారక రత్న ఏ నియోజక వర్గాల్లో పోటీ చేయాలనుకున్నారనే వివరాలను నందమూరి ఫ్యామిలీకి సన్నిహితులైన నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మీడియాతో వెల్లడించారు..
ఏపీలోని గన్నవరం, రాజా నగరం, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి, పెదకూరపాడు, రాజమండ్రి రూరల్, నూజివీడు వంటి నియోజక వర్గాలలో ఎక్కడైనా పోటీ చేయాలనుకున్నారట.. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉండేది.. చక్కగా అన్నీ ప్లాన్ చేసుకున్నారు కానీ ఇంతలోనే ఇలా జరిగింది అంటూ అభిమానులు, పార్టీ వర్గాల వారు భావోద్వేగానికి గురవుతున్నారు..
తారకరత్న అన్న పోటీ చేయాలి అనుకుని ఎంచుకున్న నియోజకవర్గాలు..ఈలోపు ఇలా విషాదం జరిగింది
గన్నవరం
రాజానగరం
గుంటూరు వెస్ట్
సత్తెనపల్లి
పెదకూరపాడు
రాజమండ్రి రూరల్
నూజివీడు pic.twitter.com/ve7tcVSlPy— Venu M Popuri (@Venu4TDP) February 22, 2023
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?