మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల వింటేజ్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో చిరు, పవన్ ల లుక్స్ ఆకట్టుకున్నాయి. చాలా మంది చూపు పవన్ కళ్యాణ్ పైనే ఉండవచ్చు.. కానీ చిరు, పవన్ లతో ఓ వ్యక్తి ముచ్చటిస్తూ కనిపిస్తున్నాడు. ఆయన ఎవరు అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. చాలా మందికి ఆయన తెలిసే ఉంటుంది. ఆయన టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ రైటర్ గా వెలుగొందారు.
ఆయన మరెవరో కాదు గొర్తి సత్యమూర్తి అలియాస్ జి.సత్యమూర్తి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ తండ్రే ఈ జి.సత్యమూర్తి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న జన్మించిన ఈయన కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవత’ చిత్రంతో రైటర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.అటు తర్వాత బావా మరదళ్లు, కిరాయి కోటిగాడు, ‘ఖైదీ నంబర్ 786’, ‘అభిలాష’, ‘పోలీస్ లాకప్’, ‘ఛాలెంజ్’ వంటి విజయవంవతమైన చిత్రాలకి ఆయన కథలు అందించారు.
1980, 90 దశకంలో వచ్చిన ‘బంగారు బుల్లోడు’, ‘భలే దొంగ’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అమ్మ దొంగా’, ‘చంటి’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘పెదరాయుడు’, ‘మాతృదేవోభవ’, రౌడీ అన్నయ్య, ‘అమ్మదొంగా’.. వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రైటర్ గా పనిచేశారు సత్యమూర్తి. మొత్తంగా ఈయన 400కు పైగా సినిమాలకు రైటర్ గా పనిచేశారు.
చిరంజీవి నటించిన ‘అభిలాష’, ‘ఖైదీ నెం 786’, ‘ఛాలెంజ్’, ‘జ్వాల’ వంటి విజయవంతమైన చిత్రాలకు ఈయన రైటర్ గా పనిచేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ ‘జానీ’ చిత్రాలకు కూడా రైటర్ గా పనిచేశారు. 2015 డిసెంబర్ 14న ఈయన చెన్నైలో మరణించారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?