Krishna Health Update: సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ అప్డేట్.. అసలు మేటర్ చెప్పిన వైద్యులు!

సూపర్ స్టార్ కృష్ణ గారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు అంటూ ఉదయం వార్తలు వచ్చాయి. కానీ కాసేపటికి సీనియర్ నటుడు నరేష్.. కృష్ణ గారు కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వెళ్లారు.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, ఆయన కాసేపటికి ఇంటికి వెళ్ళిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఘట్టమనేని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ కాసేపటికి మహేష్ బాబు అలాగే కృష్ణ గారి కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాళ్లు కృష్ణ గారు అడ్మిట్ అయిన గచ్చబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు వెళ్ళడంతో ఆందోళన నెలకొంది. ఇక కృష్ణ గారి ఆరోగ్యం పై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. “సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు రావడంతో నిన్న రాత్రి 2 గంటలకు నమ్రత గారు ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు.ఆయనకు సీపీఆర్తోపాటు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం.ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం.

మరో 24 గంటలు గడిస్తే గానీ కృష్ణ గారి ఆరోగ్యం పై క్లారిటీ ఇవ్వలేం.ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ” అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన హెల్త్ కు సంబంధించి నెక్ట్ బుల్లెటెన్ ను రేపు ఉదయం లేదా మధ్యాహ్నం ఇస్తామని కూడా వారు తెలిపారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus