టాలీవుడ్ లోని ప్రముఖ కథానాయికల్లో సమంత ఒకరు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ‘ఏమాయ చేసావే’ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. తన అందం, అభినయం తో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థిరమైన స్థానం సంపాదించుకుంది. నాగ చైతన్య నుంచి మహేష్ బాబు వరకు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. ఒకానొక టైం లో అయితే హీరోలకు పోటీ ఇచ్చేంత సమానమైన అభిమానాన్ని పొందగలిగింది సామ్.
నాగ చైతన్య తో మొదటి వివాహం కాగా, కొన్ని సంవత్సరాల వైవాహిక బంధం తరువాత పరస్పర విభేదాల కారణముగా విడాకులు తీసుకోవటంతో సామ్ జీవితం కొంత ఒడిదుడుకులకు గురి అయ్యింది. ఆ తరువాత సింగిల్ గా ఉంటూ లైఫ్ లీడ్ చేస్తున్న సమంతకు తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకుడు రాజ్ నిడిమోరు తో స్నేహం, ఆ స్నేహం ప్రేమగా మారటం, రీసెంట్ గా వారి వివాహం జరగటం అందరికి తెలిసిన విషయాలే.

అయితే వీరి వివాహం తరువాత వీరు ఎవరి వర్క్స్ లో వారు బిజీ కూడా అయ్యారు. కాగా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ లో సమంత ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఆన్లైన్ లో సమంత గురించిన ఒక వార్త హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం సామ్ ‘సమంత రూత్ ప్రభు’ అనే పేరుతో ఉండగా, రాజ్ నిడిమోరు తో వివాహం జరిగిన సందర్భంగా ఇకపై సమంత నిడిమోరుగా మారుతుందని అందరూ ఊహించారు. కానీ సామ్ ఇకపై ఓన్లీ ‘సమంత’ గా మాత్రమే ఉండబోతుందని తన పేరుకు ఏ పేరు యాడ్ చేయబోయ్యే ఆలోచన లేదని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.
