దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker) నటుడిగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అతను హీరోగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమా రూపొందింది. ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఇందులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. క్యూ అండ్ ఎలో భాగంగా ఓ సీనియర్ రిపోర్టర్ మైక్ అందుకుని తరుణ్ భాస్కర్..కి ఓ ప్రశ్న వేయడానికి రెడీ అయ్యాడు.
అయితే తరుణ్ భాస్కర్ అత్యుత్సాహం ప్రదర్శించి.. ఆ రిపోర్టర్ కి ‘హ్యాపీ క్రిస్మస్’ అంటూ వెటకారపు కామెంట్ విసిరాడు. గతంలో ‘కీడా కోలా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా తరుణ్ భాస్కర్ ఆ రిపోర్టర్ ని ‘క్రిస్మస్ తాత’ అంటూ పంచ్..లు వేశాడు. అతని కామెంట్ ను పట్టుకుని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజెన్ల ఆ రిపోర్టర్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నిన్నటి ఈవెంట్లో కూడా అలాగే చేద్దామని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు.

కానీ ఆ రిపోర్టర్ కి కోపం వచ్చింది. ‘మిమ్మల్ని ప్లాప్ హీరో. పదేళ్లుగా హిట్టు లేని డైరెక్టర్ అంటే మీరు ఊరుకుంటారా? మా పై కామెంట్లు చేసి.. జనాలకి ట్రోల్ మెటీరియల్ ఇవ్వడానికే ఈవెంట్లకి వస్తారా. నేను లేచి వెళ్ళిపోతున్నాను’ అంటూ ఆ రిపోర్టర్ ఆవేశంతో లేచి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ వెళ్లి..అతని కాళ్లపై పడి క్షమాపణలు చెప్పి.. ‘మనం కలిసి ట్రోలింగ్ బ్యాచ్ ని ట్రోల్ చేద్దాం’ అంటూ చెప్పి.. సదరు రిపోర్టర్ ని కూల్ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది నెటిజెన్లు ‘తరుణ్ భాస్కర్ ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నట్టు. ఇదంతా స్క్రిప్టెడ్ లా ఉంది’ అంటూ తమ అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
