టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీయెస్ట్ ప్రొడక్షన్ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే చెప్పాలి. కావాలంటే మీరే చూడండి ఈ సినిమా నిర్మాణ సంస్థ దగ్గర ప్రస్తుతం 30 సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో స్టార్ హీరోలు, కుర్ర హీరోలు, కొత్త హీరోలు ఇలా చాలామంది సినిమాలు ఉన్నాయి. ఇన్నే సినిమాలు చేస్తున్నారు, పెద్ద హీరోల సినిమాలు వరుసగా ఉన్నాయి… ఇక మీ టార్గెట్ రీచ్ అయినట్లేనా? అని ఆ నిర్మాణ సంస్థ అధిపతి టి.జి.విశ్వప్రసాద్ లేదు లేదు.. ఇంకో హీరో ఉన్నారు.. ఆయన సినిమానే టార్గెట్ అని చెప్పారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో పవన్ కల్యాణ్, ప్రభాస్ సినిమాలు ఉండగా.. త్వరలో నాగార్జున సినిమా మొదలవుతుంది అని అంటున్నారు. పైన చెప్పిన 30 సినిమాల్లో పెద్ద హీరోల సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక్క హీరో సినిమా అందులో లేదట. అదే విశ్వప్రసాద్ టార్గెట్ అని చెప్పారు. అతనే మెగాస్టార్ చిరంజీవి. ‘బ్రో’ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన విశ్వప్రసాద్ ఈ విషయం చెప్పారు.
‘‘నా కలల హీరో అంటే… చిరంజీవి. ఆయనతో ఓ సినిమా చేయడమే నా కల’’ అని చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్. అయితే ప్రస్తుతం ఆయన గురించి ఏదైనా కథ సిద్ధంగా ఉందా? లేక ఆ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం చెప్పలేదు. అయితే ప్రస్తుతం చిరంజీవి సినిమాలు చేస్తున్న ఫ్లోలో పీపుల్ మీడియాకు (People Media) ఓకే చెప్పడానికి పెద్ద సమయం ఏమీ పట్టదు. సరైన కథతో వెళ్తే ఆయన రెడీగా ఉంటారు అని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇక ‘బ్రో’ సినిమా గురించి ఆయన చెబుతూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఐదేళ్లవుతోంది. రెండేళ్ల కిందటే పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని అనుకున్నాం. దర్శకుడు త్రివిక్రమ్ వల్ల ‘బ్రో’ చేసే అవకాశం వచ్చింది అని క్లారిటీ ఇచ్చారు. సినిమా మొదలైన మొదటి పది నిమిషాల తర్వాత పవన్ కల్యాణ్ తెరపైకొస్తారని ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయం చెప్పారు విశ్వప్రసాద్.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు