రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రూ.1100 గ్రాస్ మార్క్ కు చేరువవుతున్న సందర్భంలో రిపీట్ ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించడానికి మేకర్స్ వారానికో వీడియో సాంగ్ ను విడుదల చేస్తూ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే ‘నాటు నాటు’ ‘కొమ్మా ఉయ్యాల’ వంటి పాటల్ని విడుదల చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ టీం తాజాగా ‘దోస్తి’ వీడియో సాంగ్ ను కూడా విడుదల చేసింది.
‘ఫ్రెండ్ షిప్’ నేపథ్యంలో గతంలో చాలా హిట్ సాంగ్స్ వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ పాట ఉంటుంది. అల్లూరి సీతారామరాజు.. బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ కొమరం భీమ్ ను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. కానీ అనుకోకుండా వీళ్ళు వేరే విధంగా కలుసుకుని ప్రాణ స్నేహితులు అవ్వడం. ఆ సందర్భానికి అనుగుణంగా వచ్చే పాట ఇది.
‘పులికి విలుకాడుకి, తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి దోస్తి’ అనే లిరిక్స్ తో ఈ పాట మొదలవుతుంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాత్రమే ఇలాంటి లిరిక్స్ అందించగలరు అనడానికి ఈ పాట నిదర్శనం. కీరవాణి అందించిన ట్యూన్ కూడా అలరిస్తుంది. కాలభైరవ ఈ పాటని పాడిన తీరు కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా అలాగే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఈ పాట ఉంటుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!