Double iSmart Vs Viswam: ‘డబుల్ ఇస్మార్ట్’ తో పోటీ పడనున్న ‘విశ్వం’ ..!
- June 19, 2024 / 02:30 PM ISTByFilmy Focus
ఆగస్టు 15 కి అల్లు అర్జున్(Allu Arjun) – సుకుమార్ (Sukumar) ..ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 ‘ (Pushpa2) రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆ టైంకి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా లేదు పరిస్థితి. అందుకే ఆ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2 ‘ విడుదల వాయిదా పడింది అనే ప్రకటన మేకర్స్ నుండి రాకముందే.. ఆగస్టు 15 కి ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సీక్వెల్ అయిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ కాబోతున్నట్లు ఆ సినిమా టీం అధికారికంగా ప్రకటించింది.
వాస్తవానికి ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. అందుకే ముందుగా ప్రకటించిన మార్చి 8 వ తేదీకి ఈ సినిమా రిలీజ్ కాలేదు. తర్వాత వాళ్ళు ఆగస్టు 15 మంచి డేట్ అని భావించి ముందుగా కర్చీఫ్ వేసేశారు. ఇదిలా ఉండగా.. మరోపక్క అదే డేట్ కి మరో మిడ్ రేంజ్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నట్టు వినికిడి. అది మరేదో కాదు.. శ్రీను వైట్ల(Srinu Vaitla) – గోపీచంద్ (Gopichand) కాంబినేషన్లో రూపొందుతున్న ‘విశ్వం’ (Viswam) మూవీ.

అవును ఈ సినిమా ఆగస్టు 15 కే రిలీజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. పూరి జగన్నాథ్ (Puri Jagannadh), శ్రీను వైట్ల.. ఇద్దరూ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు. కానీ ఈ మధ్య వాళ్ళ హవా తగ్గింది. పూరి కొంతలో కొంత ఓకే కానీ, శ్రీను వైట్ల హిట్టు కొట్టి పదేళ్లు దాటింది. మరి ఈ సీనియర్ స్టార్ డైరెక్టర్లు ఇద్దరూ కలిసి ఆగస్టు 15 న తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి.












