Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- May 24, 2026 / 08:41 PM ISTByPhani Kumar
‘దృశ్యం’ సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Drishyam 3
‘దృశ్యం’ సూపర్ హిట్ అయ్యింది. ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 3′(Drishyam 3) కూడా రూపొందింది. అయితే ఈసారి వెంకటేష్ తో కాకుండా మలయాళం వెర్షన్ నే డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

అయినప్పటికీ సూపర్ హిట్ సీక్వెల్ కాబట్టి.. ‘దృశ్యం 3’ పై మంచి హైప్ ఉంది. అందుకే మే 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ధియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
| నైజాం | 1.8 cr |
| సీడెడ్ | 0.30 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.5 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 3.6 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.20 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 3.8 cr |
‘దృశ్యం 3’ చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.3.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సూపర్ హిట్ సీక్వెల్ కాబట్టి.. సినిమాపై బజ్ ఉంది. వెంకటేష్ చేయలేదు అనే ఒక అసంతృప్తి మినహా.. మిగతా ఇబ్బందులు ఏమీ లేవు. మినిమమ్ పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి.
బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!











