DSP: ‘వీరయ్య’ హిట్‌ సాంగ్‌ వెనుక అసలు కథ చెప్పిన డీఎస్పీ!

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ స్టూడియోకు, ఇంటికి వెళ్లినవారు.. ఆయన గదిలో చుట్టూరా ఏదో ఒక మ్యూజికల్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ కనిపిస్తూ ఉంటుంది. అవేవీ ఇక్కడివి కావు, ఎక్కడెక్కిడో నుండో తెస్తుంటారు అని చెబుతుంటారు. గతంలో కొంతమంది ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అలా ఒకానొక రోజు గోవా నుండి తీసుకొచ్చిన ఓ ప్లాస్టిక్‌ పీపీనే ఇప్పుడు ‘పూనకాలు’ పెట్టిస్తోంది. అవును ‘వాల్తేరు వీరయ్య’లోని ‘పూనకాలు లోడింగ్‌..’ పాటలో వినిపించిన, కనిపించిన పీపీ గోవా నుండి తెచ్చినదట.

ముందుగా చెప్పినట్లు దేవిశ్రీప్రసాద్‌ ఇంట్లో రకరకాల ఇన్‌స్ట్రూమెంట్స్‌ ఉంటాయి. ఏదైనా విదేశాలకు వెళ్లినప్పుడు, పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆయన అక్కడి లోకల్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ తీసుకొస్తూ ఉంటారు. అలా కొన్నేళ్ల క్రితం గోవాలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ చేస్తున్నప్పుడు ఓ ఇన్‌స్ట్రూమెంట్ కోసం తిరిగారట. అలా ఓ షాప్‌లో పిల్లల సెక్షన్‌ పచ్చటి గొట్టం లాంటి ఇన్‌స్ట్రూమెంట్ కనిపించిందట. చూడటానికి కొత్తగా ఉంది కదా అని కాసేపు వాడి, కొని ఇంటికి తీసుకొచ్చుకున్నారట. దానినే ఇప్పుడు ‘పూనకాలు లోడింగ్‌..’ పాటలో వాడారట.

‘పూనకాలు లోడింగ్‌..’ పాట లిరికల్‌ వీడియో చూస్తే అందులో ఓ పచ్చటి గొట్టం కనిపిస్తుంటుంది. డీఎస్పీ దానిని ఊదుతూ కనిపించారు. ఊళ్లలో తిరునాళ్లలో అలాంటివి మనకు కూడా కనిపిస్తుంటాయి. అది ఇది కాస్త పెద్దది. ఒకే సౌండ్‌ వస్తుంది దాని నుండి. అయితే ఊదే బట్టి చిన్న మార్పు కనిపిస్తుంది. ‘పూనకాలు లోడింగ్‌..’ పాటలో జాతర అనే కాన్సెప్ట్‌ ఉందని తెలియగానే ఆ బూర లాంటి ఇన్‌స్ట్రూమెంట్‌ను వాడేశారు దేవి. పాటకు మరింత అందం తీసుకొచ్చారు.

అన్నట్లు విషయం చెప్పలేదు కదా. అంతటి హిట్‌ పాటకు మెయిన్‌ ట్యూన్‌ అందించిన ఆ బూర ధర కేవలం రూ. 250. అవును పట్టుమని మూడు వందల రూపాయలు లేని వస్తువునే ‘పూనకాలు’ పుట్టించారు దేవి. లిరికల్‌ సాంగ్‌ అదిరిపోయింది, ఒరిజినల్‌ ఎలా ఉందో సినిమాలో జనవరి 13న చూడొచ్చు. అన్నట్లు ఆ బూరను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెచ్చి ఊది మరీ చూపిస్తా అని కూడా చెప్పారు దేవి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus