ప్రేక్షకులకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. పుష్ప సినిమాలోని పాటలకు విశేషమైన స్పందన ఇస్తున్న సంగీత ప్రియులకు ఆయన థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా రాక్ స్టార్ DSP మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం.. నేను మీ దేవి శ్రీ ప్రసాద్.. పుష్ప సినిమాలోని పాటలకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇప్పటి వరకు విడుదలైన ప్రతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అన్ని భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్ వ్యూస్ కు పైగా రావడం ఆనందంగా ఉంది. త్వరలోనే పుష్ప పూర్తి ఆల్బంతో మీ ముందుకు వస్తాను. నా నుంచి వచ్చే ప్రతి పాటను ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నందుకు నార్త్, సౌత్ ఆడియన్స్ కు థాంక్స్. పాండమిక్ సమయంలో కూడా నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ గారు నటించిన రాధే సినిమాలో..
నేను కంపోజ్ చేసిన సీటీమార్ పాటకు వందల మిలియన్ వ్యూస్ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది మొదట్లో ఉప్పెన సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో ఇయర్ ఎండింగ్ మరో బ్లాక్బస్టర్ సినిమాతో రాబోతున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. త్వరలోనే మరిన్ని మంచి సినిమాలతో వస్తాను..” అని తెలిపారు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!