Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డ్యూడ్’ సినిమా నిన్న అంటే అక్టోబర్ 17న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ పై చాలా మంది పెదవి విరిచారు. కొంతమంది అయితే సెకండాఫ్ సినిమాని స్పాయిల్ చేసింది అంటూ సినిమాకి నెగిటివ్ టాక్ చెప్పారు. దీనిని నిర్మాత వై.రవి శంకర్ తోసిపుచ్చారు.

Dude

ఆయన మాట్లాడుతూ.. ” నిన్న రిలీజ్ రోజున అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్నారు. కానీ సెకండాఫ్ పై కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో కంగారు పడి మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాము. సెకండాఫ్ లో మెయిన్ స్టోరీ మొదలైంది. ఆల్మోస్ట్ 10 బ్లాక్స్ అయితే అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి. సెకండాఫ్ పై ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యింది. అంతకంటే ఏం కావాలో.

అసలు సెకండాఫ్ బాలేదు అని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు” అంటూ రవి శంకర్ చెప్పుకొచ్చారు.ఈరోజు నిర్వహించిన ‘డ్యూడ్’ సక్సెస్ మీట్లో ఆయన ఈ విధంగా చెప్పుకురావడం జరిగింది.అలాగే తెలుగులో కంటే తమిళంలో 2 రెట్లు ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చినట్టు కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.22 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయినట్టు రివీల్ చేశారు.

కేరళలో(మలయాళంలో) కూడా ‘డ్యూడ్’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టు.. ఈ సందర్భంగా రవి శంకర్ అలాగే నవీన్.. చెప్పుకొచ్చారు. చూడాలి మరి మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో.

‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus