Allu Arjun: ఆ హీరోయిన్ తో సినిమా చెయ్యవద్దని అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చిన స్నేహ రెడ్డి..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి జంట ముందు వరుసలో ఉంటుంది. అల్లు అర్జున్ అభిమాని అయిన స్నేహా రెడ్డి అతనినే ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ జంటకి అల్లు అయాన్, అల్లు అర్హ అని ఇద్దరు పిల్లలు పుట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. బ్రతికితే ఇలా బ్రతకాలి అని అనిపించేలా ఉంటుంది ఈ కుటుంబం.

సినిమాల్లో ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ తన కుటుంబం తో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతాడు. అలా ఎంతో అన్యోయంగా ఉండే వీళ్ళ మధ్య ఒక హీరోయిన్ కారణంగా అప్పట్లో గొడవ అయ్యిందట. ఏ రేంజ్ లో అంటే ఆమెతో సినిమా చేస్తే ఇక నేను నీతో కలిసి ఉండలేను అని స్నేహ రెడ్డి అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చే రేంజ్ లో అట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, రకుల్ ప్రీత్ సింగ్. గతం లో వీళ్లిద్దరు కలిసి ‘సరైనోడు’ అనే చిత్రం లో నటించారు.

ఇందులో వీళ్లిద్దరి జంట చూసేందుకు చక్కగా అనిపించింది, సినిమా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లోనే రకుల్ ప్రీత్ సింగ్ అల్లు అర్జున్ కి మంచి స్నేహితురాలు అయ్యిందట. ఆ స్నేహం కాస్త అప్పట్లో మితి మీరింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన టాక్. ప్రతీ రోజు ఫోన్ కాల్స్ చేసేది అట, గంటల తరబడి మాట్లాడేది అట. ఇక పార్టీలలో కలిసినప్పుడు చాలా అతి చనువు తో ఉండడం వంటివి చేసేదట.

అలా చెయ్యడం వల్ల (Allu Arjun) అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి కి మధ్య చిన్నపాటి గొడవలు ఏర్పడ్డాయి. ఇక నుండి ఆ అమ్మాయితో సినిమాలు చెయ్యొద్దు అని చాలా స్ట్రిక్ట్ గా అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లు అర్జున్ రకుల్ ప్రీత్ తో కలిసి నటించలేదు. యాడ్ లో కలిసి నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసాడు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus