Brahmamudi July 25th: రాజ్ మాటలకు ముక్కలైన కావ్య మనసు… భార్యగా అంగీకరించరా?

  • July 25, 2023 / 12:14 PM IST

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… కావ్య తన కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. మరోవైపు స్వప్న యాడ్ షూట్ పూర్తి చేసుకొని కారులో ఇంటికి వస్తారు. అప్పటికే స్వప్న మీద కుటుంబం మొత్తం చాలా కోపంతో ఉంటారు. ఇక పుట్టింటి నుంచి కావ్య కూడా ఆటోలో ఇంటికి వస్తుంది.

ఇలా స్వప్న కావ్య ఇద్దరూ ఒకేసారి రావడంతో స్వప్న డ్రెస్ చూసి షాక్ అయిన కావ్య అసలు ఈ డ్రెస్ లో బయటికి వెళ్లడం ఏంటి ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమైనా ఉందా అని అనడంతో స్వప్న మాత్రం పొగరుగా ఈ డ్రెస్ వేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లానని చెబుతుంది. లోపలికి వెళ్లేసరికి అందరూ కూడా తన పట్ల సీరియస్గా ఉంటారు. ఈ డ్రెస్ వేసుకొని వెళ్లడం ఏంటి అని ఒక్కొక్కరు తనని ప్రశ్నించగా రిచ్ పీపుల్స్ ఇలాగే ఉంటారని స్వప్న పొగరుగా మాట్లాడుతుంది.

ఇక రుద్రాణి ఇదే అవకాశంగా తీసుకొని నానా మాటలు అని బయటకు పంపించాలని చెబుతుంది. కావ్య తనేదో తెలుసో తెలియకో ఇలాంటి డ్రెస్ వేసుకుని దానికి బయటకు పంపించడం దేనికి తన పెళ్లి ఎలాంటి పరిస్థితులలో జరిగిందో మీకు తెలియదా అని మాట్లాడుతుంది. అయితే రాజ్ మాత్రం కావ్యను ఒక్క మాట కూడా అననివ్వకుండా అడ్డుకుంటారు. అలాగే రాహుల్ కి కూడా వార్నింగ్ ఇస్తాడు.

పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని నువ్వు ఏం మగాడివి ఏం మొగుడివి తనని కంట్రోల్ లో పెట్టుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ తనకి వార్నింగ్ ఇస్తారు. ఈ విధంగా కావ్య పట్ల ఒక్క మాట కూడా పడనివ్వకుండా తనకు సపోర్ట్ చేసినటువంటి రాజ్ పట్ల కావ్య సంతోషపడుతుంది. దేవుడి వద్దకు వెళ్లి తనని తన భర్త భార్యగా అంగీకరిస్తారో లేదో అనుకున్నాను కానీ నాకు చాలా సపోర్ట్ చేసి మాట్లాడారు అంటూ సంతోషపడుతుంది.

మరోవైపు అపర్ణ తన కొడుకుతో మాట్లాడటం కావ్య వింటుంది. ఈమధ్య నీకి నీ భార్యకు మధ్య తొలిప్రేమ అలంకరించిందా గత కొద్దిరోజుల నుంచి చూస్తున్నాను తనపై ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. తనని నువ్వు భార్యగా ఒప్పుకోవచ్చు కానీ నేను మాత్రం కోడలిగా అంగీకరించినని చెబుతుంది. తల్లి మాటలు విన్నటువంటి నేను కూడా తనని భార్యగా అంగీకరించడం లేదు ఒక సాటి మనిషిగా మాత్రమే తనకు సహాయం చేస్తున్నాను.

తాను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదు అలాగే ఇంట్లో మీరెవరు లేకపోతే నాకు బాగాలేని సమయంలో తాను ఎంతో కష్టపడి నన్ను కాపాడింది. ఇలా నాకు సహాయం చేసిన వ్యక్తికి ఒక సాటి మనిషిగానే తాను సహాయం చేస్తున్నానని అంతకుమించి మరేది లేదని రాజ్ చెబుతాడు. ఈ మాటలను విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus