Bigg Boss Telugu 6: చప్పగా సాగిన 11వ వారం నామినేషన్స్..! సీజన్ అందుకే ప్లాప్ అయ్యింది..!

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ అనేవి చప్పగా సాగాయి. అసలు కంటెస్టెంట్స్ కి నామినేషన్స్ లో పాయింట్స్ లేకుండా పోయాయి. శనివారం నాగార్జున ఇచ్చిన హింట్స్ ని ఫాలో అవుతూ కంటెస్టెంట్స్ నామినేషన్స్ గుద్దేస్తున్నారు. అందుకే, ఈవారం కూడా హౌస్ మేట్స్ రోహిత్ ఎగ్రెసివ్ నెస్ కి, ఇనాయా F*** అనే పదానికి నామినేషన్స్ ఎక్కువగా పడ్డాయి. రోహిత్ ని బస్తా టాస్క్ లో కోపం ఎక్కువైందని, బస్తాని కాలితో తన్నడం నచ్చలేదని హౌస్ మేట్స్ నామినేట్ చేశారు.

అలాగే, ఇనాయా కెప్టెన్సీ స్టిక్కరింగ్ టాస్క్ లో ఎక్కువగా మాట్లాడిందని చెప్పి నామినేట్ చేశారు. నిజానికి వేరే హౌస్ మేట్స్ పాయింట్స్ ని నాగార్జున ఖండించలేదు. అందుకే, మిగతా కంటెస్టెంట్స్ పై పాయింట్స్ లేకుండా పోయాయి. ఈవారం ఫైమా కెప్టెన్ కాబట్టి ఎవరూ నామినేట్ చేయలేదు. ఈసారి బిగ్ బాస్ ఒక్క ఓటు వచ్చిన వారిని కూడా నామినేషన్స్ లిస్ట్ లో చేర్చారు. శ్రీహాన్ ని ఆదిరెడ్డి మాత్రమే నామినేట్ చేస్తే, ఇనాయా రాజ్ ని, కీర్తి శ్రీసత్యని, కేవలం ఒక్క ఓటుతో నామినేట్ చేశారు.

అత్యధికంగా రోహిత్ కి 4 ఓట్లు, ఇనాయాకి 4 ఓట్లు వచ్చాయి. మిగతా వాళ్లు 2 ఓట్లతో నామినేట్ అయ్యారు. ఎప్పటిలాగానే ఆదిరెడ్డికి ఇనాయాకి మాటల యుద్ధం అయ్యింది. అలాగే ఈగో ఫీలింగ్స్ తో శ్రీసత్య, కీర్తి ఇద్దరూ రెచ్చిపోయారు. అలాగే రోహిత్ కి ఇంకా రేవంత్ కి గట్టి మాటల యుద్ధమే జరిగింది. మొత్తానికి ఈవారం నామినేషన్స్ లో కెప్టెన్ ఫైమా తప్పించి అందరూ ఉన్నారు.

రోహిత్, ఇనాయా, రేవంత్, కీర్తి, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, మెరీనా ఇంకా ఆదిరెడ్డి ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది ఆసక్తికరం. అంతేకాదు, ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగితే హౌస్ నుంచీ ఎవరు వెళ్లిపోబోతున్నారు అనేది చూడాలి. అదీ మేటర్.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus