Dulquer Salmaan: ఆ విమర్శలు నన్ను ఎంతగానో బాధ పెట్టాయి: దుల్కర్ సల్మాన్

‘ఓకె బంగారం’ ‘మహానటి’ ‘కనులు కనులను దోచాయంటే’ ‘కురూప్’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. ఈ మధ్యనే అతను హీరోగా వచ్చిన ‘సీతా రామం’ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 10 రోజుల క్రితం హిందీలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా హిట్ విజయం సాధించింది ఈ మూవీ.

‘సీతా రామం’ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు దుల్కర్ సల్మాన్. ఈ సినిమా వేడి ఇంకా తగ్గకముందే ‘చుప్ : రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దుల్కర్ బాలీవుడ్లో చేస్తున్న మూవీ ఇది. ఈ చిత్రంలో ఇతను నెగిటివ్ రివ్యూస్, విమర్శలు ఎదుర్కొనే నటుడుగా కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన దుల్కర్.. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

‘నిజ జీవితంలో కూడా మీరు నెగిటివ్ రివ్యూస్, విమర్శలు ఫేస్ చేశారా? అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?’ అనే ప్రశ్న ఇతనికి ఎదురైంది. దానికి దుల్కర్ బదులిస్తూ.. “కెరీర్ ప్రారంభంలో ప్రతి ఒక్క నటుడుకి రివ్యూలు చదవాలని ఉంటుంది. తనకి, తన నటనకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అని తెలుసుకోవాలి అని ఉంటుంది.

నాకు కూడా ఉండేది. అందుకే రివ్యూలు చదివే వాడిని. మొదట్లో నాకు యాక్టింగ్ రాదని, నేను సినిమాలకు పనికిరాను అని, నేను ఇండస్ట్రీలో ఉండకూడదు అని కోరుకుంటున్నట్టు రాసుకొచ్చారు. అప్పుడు నాకు చాలా బాధేసింది. బహుశా నా నుండి విమర్శకులను మెప్పించే పాత్ర ఇంకా రాలేదేమో, రావడానికి టైం పడుతుందేమో అని నాకు నేను నచ్చజెప్పుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus