Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్
- June 24, 2025 / 02:57 PM ISTByPhani Kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్ కి రెడీగా ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో సగం షూటింగ్ పూర్తయ్యాక.. పవన్ డేట్స్ డిలే అవ్వడం… తర్వాత రత్నం కృష్ణ వచ్చి బ్యాలెన్స్ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఏ.ఎం.రత్నం నిర్మించారు.
Dulquer Salmaan
‘తమ్ముడు’ (Thammudu) సినిమాకు రూ.75 కోట్ల వరకు బడ్జెట్ అయ్యింది. నితిన్ గత సినిమా ‘రాబిన్ హుడ్’ (Robinhood) కి రూ.70 కోట్లు బడ్జెట్ పెట్టారు. దానికి సగం బడ్జెట్ కూడా రికవరీ కాలేదు. అయినా సరే దిల్ రాజు (Dil Raju) ‘తమ్ముడు’ కి దానికి మించి బడ్జెట్ పెట్టారు. ఇందులో కూడా నితిన్ (Nithiin) కి, దర్శకుడు వేణుకి పారితోషికం పూర్తిగా ఇవ్వలేదు అని దిల్ రాజు స్టేజిపైనే చెప్పారు.

ఎట్టకేలకు ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేస్తున్నట్టు టీం ప్రకటించింది. కానీ అది కూడా కన్ఫర్మ్ కాదు అనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికీ రిలీజ్ డేట్ గురించి డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈసారి అంత ల్యాగ్ ఉండకపోవచ్చు. అయితే జూలై 24 లేదా జూలై 25.. ఈ డేట్లకే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తన వంతు సాయం చేయబోతున్నాడట. అదెలా అనుకుంటున్నారా? ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మలయాళ వెర్షన్ ను దుల్కర్ కేరళలో రిలీజ్ చేయనున్నాడట. దుల్కర్ గతేడాది వచ్చిన ‘క’ (KA) చిత్రాన్ని కూడా కేరళలో రిలీజ్ చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దుల్కర్ మంచి టేస్ట్ ఉన్న హీరో కాబట్టి.. ‘హరిహర వీరమల్లు’ కంటెంట్ పరంగా మెప్పించే అవకాశాలు ఉండొచ్చు.
దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది
















