Dulquer Salmaan: పాన్ ఇండియా సినిమాలపై దుల్కర్ సల్మాన్ సెన్సేషనల్ కామెంట్స్..!

  • August 3, 2022 / 02:33 PM IST

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ‘ఓకె బంగారం’ ‘మహానటి’ ‘కనులు కనులను దోచాయంటే’ ‘కురుప్’ వంటి చిత్రాలు ఇక్కడ కూడా విజయం సాధించాయి. ఈసారి మరో స్ట్రైట్ తెలుగు మూవీతో అతను తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే ‘సీతా రామం’ చిత్రం. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కూడా కీలక పాత్ర పోషించింది.

‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్, పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘సీతా రామం’ పై ఫుల్ పాజిటివిటీ నెలకొంది. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివిటీ ఏ చిత్రానికి ఏర్పడలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా పాన్ ఇండియా సినిమాల గురించి దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ అనే చిత్రంలో తెలుగు, తమిళ్, బెంగాలీ ఇలా వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఇందులో నటించారు.’సీతా రామం’ ని తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. ఇదే విషయాన్ని దుల్కర్ వద్ద ప్రస్తావించగా.. “పాన్ ఇండియా అనే మాట విని విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా ఒక్క ఆర్టికల్ కూడా ఉండటం లేదు. నిజానికి పాన్ ఇండియా అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు.

అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది సినిమాలు దేశ విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ అని ఒత్తి చెప్పడం అవసరం లేదని నా ఫీలింగ్. ఫిల్మ్ ని ఫిల్మ్ అంటే చాలు” అంటూ చెప్పుకొచ్చాడు. దుల్కర్ హీరోగా కెరీర్ ను ప్రారంభించిన 10 ఏళ్లలో మలయాళంతో పాటు ఇంకా పలు భాషల్లో సినిమాలు చేశాడు. మొత్తంగా అవి 35 వరకు ఉండటం విశేషం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus