హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు డెబ్యు ప్లాన్ చేస్తున్నాడు

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కథానాయకుడు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి కొడుకుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనదైన నటనతో, స్క్రిప్ట్ సెలక్షన్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకొన్నాడు. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో స్ట్రయిట్ సినిమాలు చేసినప్పటికీ.. తెలుగులో మాత్రం “మహానటి” చిత్రంలో పోషించిన సపోర్టింగ్ రోల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దుల్కర్ కి. అయితే.. ఇటీవల విడుదలైన “కనులు కనులను దోచాయంటే” ఘన విజయం సాధించి ఉండడంతో ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట దుల్కర్. గత శుక్రవారం విడుదలైన “కనులు కనులను దోచాయంటే”కి పెద్దగా ప్రమోషన్స్ గట్రా లేకపోయినా కేవలం పాజిటివ్ మౌత్ టాక్ పుణ్యమా అని మంచి కలెక్షన్స్ & హౌస్ ఫూల్స్ తో నడిచింది. దాంతో మంచి స్క్రిప్ట్ పడితే తెలుగులోనూ హీరోగా తాను రాణించగలను అని దుల్కర్ కి తెలిసొచ్చింది.

ఈమేరకు హను రాఘవపూడితో ఒక సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడని తెలిసింది. సరైన కమర్షియల్ సక్సెస్ లేకపోయినా.. కళాత్మక చిత్రీకరణలో పేరు మోసిన డైరెక్టర్ హను రాఘవపూడి. “పడి పడి లేచే మనసు” అనంతరం హను మళ్ళీ మరో సినిమా సైన్ చేయలేదు. ఒకవేళ అన్నీ సెట్ అయితే.. హను దర్శకత్వంలో దుల్కర్ సినిమా త్వరలోనే ఎనౌన్స్ అయ్యే అవకాశాలున్నాయి. మరి దుల్కర్ మ్యాజిక్ హనుకి ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడాలి.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus