Pawan Kalyan: ‘వీరమల్లు’ పరిస్థితి దారుణంగా ఉందా?

సినిమాల్లో డూప్‌లు ఉండటం సహజం, కొన్ని రిస్కీ షాట్లు వాళ్లతో చేయించడమూ సహజం. అయితే రియల్‌ హీరో సీన్స్‌ కంటే, డూప్‌ సీన్స్‌ ఎక్కువైతే, ఒకానొక సందర్భంలో రియల్‌ హీరోను డూప్‌ ఓవర్‌టేక్‌ చేసేస్తే.. చాలా ఇబ్బంది. దీని గురించి బాగా తెలియాలంటే ‘రాధేశ్యామ్‌’ సినిమాను చూసినవాళ్లను అడిగితే సరి. ఆ సినిమాలో ప్రభాస్‌ డూప్‌తో చాలా సీన్స్‌ తీశారు. సినిమాలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. దీంతో సినిమాతో అభిమానుల కనెక్షన్‌లో గ్లిచెస్‌ వచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ‘హరి హర వీరమల్లు’ విషయంలోనూ ఇదే జరగొచ్చు అనే భయం పట్టుకోవడమే.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సాగుతోంది. అయితే తొలి రోజుల్లో షూటింగ్‌కి వచ్చిన పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జనసేన కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. దీంతో డూప్‌ల సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. అంటే.. సినిమాలో లాంగ్‌ షాట్‌ సీన్స్‌, డూప్‌లు అవసరమైన షాట్లను తెరకెక్కించే పనిలో ఉందట టీమ్‌. అయితే అవసరమైన దానికంటే డూప్‌ల వాడం ఎక్కువైందనే గుసగుసలు టీమ్‌లో వినిపిస్తున్నాయట.

బాలకృష్ణతో క్రిష్ చేసిన ‘ఎన్టీఆర్‌ క‌థానాయ‌కుడు’, ‘ఎన్టీఆర్‌ మ‌హానాయ‌కుడు’ రెండూ ఫ్లాప‌య్యాయి. ఆ తర్వాత వైష్ణవ్‌తేజ్‌తో చేసిన ‘కొండ‌పొలెం’ పరిస్థితీ అంతే. దీంతో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ షూటింగ్ న‌త్త న‌డ‌క‌లా సాగుతోంది. ప‌వ‌న్ కల్యాణ్‌ కాల్షీట్లు అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల సినిమా ఆగుతూ, ఆగుతూ జరుగుతోంది. దీనికి కారణం పవన్‌ కల్యాణ్‌ రాజకీయం – సినిమాల రెండు పడవల ప్రయాణమే అని చెప్పొచ్చు. అయితే సినిమా కథ విషయంలో పవన్‌ అసంతృప్తి కూడా ఓ కారణం అని అంటున్నారు.

నిజానికి ఈ డూప్‌ల సీన్లు ఎక్కువైతే ఇబ్బంది పడే పరిస్థితి ‘సైరా’ సినిమాలోనూ చూశాం. అక్కడ అవసరమై చేస్తే.. ఇక్కడ తప్పక చేస్తున్నారు అని అంటున్నారు. అయితే పవన్‌ అంటే రాజకీయం.. సినిమా అంటే పవన్‌ డూప్‌ అనే పరిస్థితి వచ్చిందా? వస్తే చాలా ఇబ్బంది అనే విసుర్లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus