Chandra Hass: ఉప్పల్ స్టేడియంలో నటుడు ప్రభాకర్ కొడుకు.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

  • September 27, 2022 / 12:37 PM IST

బుల్లితెర సీరియల్ నటుడు ప్రభాకర్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు. బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈయన తన కొడుకును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నానంటూ అనౌన్స్మెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాకర్ మాట్లాడుతుండగా ఆయన కొడుకు చంద్రహాస్ వెనుక నిలబడి తన యాటిట్యూడ్ చూపించారు. చంద్రహాస్ జేబులో చేతులు పెట్టుకోవడం ఒకచోట స్థిరంగా నిలబడకుండా తన ఆటిట్యూడ్ చూపించడంతో పెద్ద ఎత్తున చంద్రహాస్ నేటిజన్ ల ట్రోలింగ్ కి గురయ్యారు.

ఈ క్రమంలోనే నేటిజెన్స్ చంద్రహాస్ ఒక సినిమా కూడా విడుదల కాకుండానే ఈయనకి యాటిట్యూడ్ స్టార్ అంటూ పేరు పెడుతూ భారీగా ట్రోల్ చేశారు. అయితే తన కుమారుడి గురించి వచ్చిన ట్రోల్స్ పై ప్రభాకర్ స్పందిస్తూ మంచేనా చెడైనా తన కుమారుడికి ప్రీ పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాడు తాను ఇక్కడ ఎలా ప్రవర్తించాలో మునుముందు తెలుసుకుంటాడు. ఇక ప్రస్తుతం తన కొడుకు ప్రవర్తన బాగాలేదు అన్నవాళ్లే రేపు తన కొడుకు నటన చూసి బాగుందని మెచ్చుకోవచ్చు.

జనాలు ఎలాగైనా మాట్లాడతారు అంటూ ఈయన చాలా సింపుల్ గా ఈ విషయంపై స్పందించారు. ఇదిలా ఉండగా మరోసారి ప్రభాకర్ తన కుమారుడు ఉప్పల్ స్టేడియంలో సందడి చేస్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం వీరిద్దరూ ఉప్పల్ స్టేడియంకి వెళ్ళారు.

ఈ క్రమంలోనే అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేయడంతో మరోసారి చంద్రహాసన్ ను నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. జాతీయ జెండా చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకున్నావా అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ మరోసారి చంద్రహాస్ ను ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus