హవ్వా ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాకి వచ్చే కలెక్షన్సా అవి ?
- May 10, 2019 / 01:46 PM ISTByFilmy Focus
ఓవర్సీస్ మార్కెట్ లో మొట్టమొదటిసారి జయకేతనం ఎగురవేసిన కథానాయకుడు మహేష్ బాబు. అసలు తెలుగు సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ లో క్రేజ్ తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్ బాబు. అలాంటి మహేష్ బాబు కెరీర్ లో ఓవర్సీస్ లో విడుదలైన సినిమాల్లో ఒక్క “బిజినెస్ మ్యాన్” మినహా ప్రతి సినిమా 1 మిలియన్ కలెక్ట్ చేయగా.. “శ్రీమంతుడు, భరత్ అనే నేను” చిత్రాలు ఏకంగా 2 మిలియన్ వసూలు చేశాయి. అలాంటి మహేష్ బాబు సినిమా ప్రీమియర్స్ అనగానే కనీసం 1 మిలియన్ వసూలు చేస్తుంది అనుకున్నారు జనాలు.
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అందులోనూ మహేష్ 25 సినిమా కావడం, ముగ్గురు నిర్మాతలు నిర్మించి ఉండడంతో “మహర్షి” ప్రీమియర్ షోస్ కే కనీసం 1 మిలియన్ వసూలు చేసి.. ఓవరాల్ ఓవర్సీస్ లో 5 నుంచి 6 మిలియన్ వసూలు చేస్తుందని అంచనాలు వేసుకొన్నారు. కట్ చేస్తే.. ప్రీమియర్ షోస్ కి మొత్తం కలిపి 600K కూడా కలెక్ట్ అవ్వలేదు. దాంతో “మహర్షి” ఓవరాల్ రన్ లో 2 మిలియన్ వసూలు చేయడం అనేది చాలా కష్టమని అర్ధమవుతుంది. మరి మహేష్ విషయంలో ఓవర్సీస్ మార్కెట్ ఇలా డల్ అవ్వడం అనేది కథానాయకుడిగా ఆయన ఉనికిని ప్రశ్నించే అంశం.

















