బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ర్యాంకింగ్ టాస్క్ నడుస్తోంది. ఎవరెవరు ఏయే పొజీషన్స్ కి అర్హులో హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా నిర్ణయించుకుని బిగ్ బాస్ కి చెప్పారు. నెంబర్ 1లో శివాజీని, నెంబర్ 2లో యావర్ ని పెట్టారు. అలాగే, 3లో పల్లవి ప్రశాంత్, 4లో ప్రియాంక, 5లో శోభాశెట్టి వీళ్లని టాప్ 5గా అనుకున్నారు హౌస్ మేట్స్. మిగతా ఐదుగురు మెంబర్స్ మాత్రమే ఆడేలా ఎవిక్షన్ ఫ్రీపాస్ టాస్క్ ని డిజైన్ చేశాడు బిగ్బాస్. ఈ టాస్క్ లో అర్జున్, గౌతమ్, అమర్ దీప్, అశ్విని రతిక పార్టిసిపేట్ చేశారు.
స్మిమ్మింగ్ పూల్ నుంచీ కీస్ ని తీస్కుని వచ్చి వారికి ఎలాట్ చేసిన బాక్స్ లని ఓపెన్ చేసి స్టాండ్స్ పై ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని వచ్చేలా బ్లాక్స్ పేర్చాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో అర్జున్ అంబటి అందరికంటే త్వరగా బ్లాక్స్ ని పేర్చాడు. అయితే, ఒక బ్లాక్ మాత్రం రివర్స్ లో పెట్టాడు. ఇలా చాలామంది రెండు మూడు తప్పులు చేశారు. శివాజీ సంచాలక్ గా అర్జున్ ది కన్సిడర్ చేస్తూ ఇచ్చాడు. దీంతో అర్జున్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది.
కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే., ఈ పాస్ తన దగ్గర ఉండదు. అది చేతులు మారుతూ ఉంటుంది. మళ్లీ టాప్ 5లో ఉన్నవారితో పోటీ పడి ఛాలెంజస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఛాలెంజస్ ఎదుర్కుని పాస్ ని తమ తగ్గర దక్కించుకున్నవాళ్లకే ఈ పాస్ వస్తుంది. అర్జున్ దగ్గర్నుంచీ ప్రస్తుతం ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది పాస్ అయ్యింది. అది యావర్ చేతిలోకి వెళ్లింది. యావర్ పల్లవి ప్రశాంత్ ని ఎంచుకుని టాస్క్ ఆడేందుకు సిద్ధపడ్డాడు. ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరం.
ఇలా ఫైనల్ గా ఎవరైతే చాలెంజస్ లో గెలిచి పాయింట్స్ సాదిస్తారో వారికి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది దక్కుతుందని బిగ్ బాస్ చెప్పాడు. ఇది టాస్క్ లో ట్విస్ట్. నిజానికి ఇది లైవ్ లో టాస్క్ పూర్తి అయిపోయింది. ర్యాంకింగ్ ఎపిసోడ్ మార్నింగ్ అయితే, ఈవినింగ్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కంప్లీట్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. కానీ, టెలికాస్ట్ లో మాత్రం ఇంకా నామినేషన్స్ కి సంబంధించిన ఫుటేజ్ మాత్రమే టెలికాస్ట్ అవుతోంది. దీంతో బిగ్ బాస్ ఆడియన్స్ చాలా నిరుత్సాహంగా ఉన్నారు. టాస్క్ లో గొడవేంటంటే., మిగిలిన ఐదుగురు వేరేవాళ్లకి సహాయం చేయద్దని బిగ్ బాస్ ఎక్కడా చెప్పలేదు.
కానీ, వాళ్లు సలహాలు ఇస్తుంటే శివాజీ ఆపేశాడు. ఎవరిని అరవద్దని వాళ్ల గేమ్ వాళ్లని ఆడనివ్వమని బయట నుంచీ మీరు ఎలాంటి సలహాలు ఇవ్వద్దని చాలా స్ట్రిక్ట్ గా చెప్పడంతో అందరూ సైలెంట్ గా టాస్క్ ని చూస్తున్నారు. అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, ఇంకా రతిక టాస్క్ ని ఫినిష్ చేశారు. ఫైనల్ గా అందరూ తప్పుగానే పేర్చారు. ఒకటి రెండు బ్లాక్స్ రివర్స్ లో పెట్టారు. దీంతో శివాజీ ఫైనల్ డెసీషన్ తీస్కోవాల్సి వచ్చింది. అర్జున్ అంబటి ఈటాస్క్ లో గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నాడు. కానీ, అతని దగ్గర ఇది పాస్ అయి యావర్ కి వచ్చింది.
అయితే, ఇక్కడ ఎవిక్షన్ ఫ్రీపాస్ ఎవరికి ఇవ్వాలి అనుకున్నాడో (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఇచ్చేయచ్చుగా, ఈ డ్రామా ఎందుకు అనే కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాగే ఈవారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో అర్జున్ , గౌతమ్, యావర్, అమర్ దీప్ మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అలాగే రతిక, శోభా, అశ్విని, ఇంకా ప్రియాంక ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ నలుగురు కూడా డేంజర్ జోనే లోనే ఉన్నారు. మేల్ కంటెస్టెంట్స్ సేవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ, ఫిమేల్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉంటే పాస్ గెలుచుకున్నవారు తమకోసం వాడతారా లేదా వేరేవాళ్లన సేవ్ చేయడం కోసం వాడతారా అనేది ఆసక్తికరం.