Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలినా మా విశ్వరూపం చూపిస్తామంటున్న అభిమానులు..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఒక ఈగ వాలినా మేమేంటో చూపిస్తాం అంటున్నారు అభిమానులు.. యాక్టర్‌గా ఆయన స్టార్‌డమ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఓ సూపర్ స్టార్‌గా లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేయాల్సింది పోయి.. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడవడానికి ‘జనసేన’ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. మిగతా పార్టీల వాళ్లు ఆయన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేస్తుండగా.. ఇన్నాళ్లూ చాలా ఓపికపట్టి, మౌనంగా ఉన్నారు. ఇటీవల తన విశ్వరూపం చూపించారు.. తన గురించి తప్పుడు కూతలు కూస్తే చెప్పు తెగుద్దని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఇంటి ముందు సోమవారం (నవంబర్ 2) రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కళ్యాణ్ పర్సనల్ బౌన్సర్లతో గొడవకు దిగడం.. గొడవ పడిన యువకులు ఏకంగా ఒకరిపై ఒకరు చేసుకునే స్థాయికి వెళ్లడం.. బౌన్సర్ల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకులను అరెస్టు చేయడం జరిగింది. విచారణలో వాళ్లు ఎలాంటి రెక్కీ నిర్వహించలేదని తెలిసిందని, ఇదేమంత సీరియస్ విషయం కాదని, అసలు పవన్ హత్యకు కుట్ర అనేదే జరగలేదని పోలీసులు వెల్లడించారు..

అయినప్పటికీ ఆయన భద్రత విషయంలో ఫ్యాన్స్, పార్టీ వర్గాలవారు ఆందోళనలోనే ఉన్నారు.. పవన్‌కి ప్రాణ హాని ఉందని.. ఆయణ్ణి హత్య చేయడానికి రూ. 250 కోట్లు సుపారీ ఇచ్చారనే వార్తలు వైరల్ అయ్యాయి.. ఈ న్యూస్ తెలియగానే విదేశాల్లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసనతో కలిసి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చేశారు.. బాబాయ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయించారట చరణ్.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తర్వాత వెకేషన్‌కి వెళ్లిన చరణ్, బాబాయ్ గురించి వస్తున్న వార్తలు విని షాక్ అయ్యారని.. తానే సెక్యూరిటీ విషయాలన్నీ దగ్గరుండి చూసుకున్నారని తెలిసింది..

ఇదిలా ఉంటే రీసెంట్‌గా పవర్ స్టార్ భద్రత కోసం మాజీ ఆర్మీ ఇంటిలిజెన్స్ అధికారులను నియమించుకున్నారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. జనసేనానికి రక్షణ కల్పించడం కోసం పది మంది మాజీ అధికారులు ఆయన ఇంటికి చేరకున్నారంటూ ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.. దీంతో.. ప్రభుత్వం కలుగజేసుకుని పవన్‌కి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని.. తమ అభిమాన నటుడి మీద ఈగ వాలినా మా విశ్వరూపం చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేసున్నారు ఫ్యాన్స్, జనసైనికులు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus