Extra Trailer Review: జీవిత, షర్మిల పై నితిన్ సెటైర్లు.. ట్రైలర్ అదిరింది.!

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ ఎక్స్ ట్రా ‘. డిసెంబర్ 8 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. టీజర్ ను అక్టోబర్ 30 న విడుదల చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. అందులో కామెడీ కూడా హైలెట్ అయ్యింది. అలాగే కొంచెం యాక్షన్ కూడా ఉంది. గతంలో యాక్షన్ తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసిన ప్రతిసారీ హిట్లు అందుకొన్నాడు నితిన్.

దర్శకుడు వక్కంతం వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకే వీరిద్దరూ తమకు కలిసి వచ్చిన జోనర్లోనే సినిమా చేస్తున్నారు అని టీజర్ చెప్పకనే చెప్పింది. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే… ఇది 2 నిమిషాల 28 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇది కూడా కంప్లీట్ గా ఫన్ తో కూడి ఉంది. చిన్నప్పటి నుండీ ప్రతి చోట వెనుక నిలబడే హీరో పెద్దయ్యాక అలా సినిమాల్లో వెనుక నిలబడే జూనియర్ ఆర్టిస్ట్ అవ్వడం..

ఆ తర్వాత వచ్చే ట్రాక్స్ అన్నీ కామిడీని జనరేట్ చేసే విధంగా ఉంటాయి అనిపిస్తుంది. రావు రమేష్ నటన కూడా హైలెట్ అయ్యేలా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన షర్మిల డైలాగ్ కూడా ఇందులో నితిన్ తో కామిడీగా చెప్పించారు. చివర్లో రాజశేఖర్ ఖైదీగా ఇచ్చి జీవిత గురించి కామిడీ డైలాగ్ చెప్పడం కూడా హైలెట్ అయ్యింది. ట్రైలర్ (Extra) అయితే బాగుంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus